తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ముఖ్యమంత్రి కావాలనుకునే అభ్యర్థులు ఒక సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. అది ఏమిటంటే పాదయాత్ర చేయటం. ఈ పాదయాత్ర మొదట 2004 ఎన్నికలకు ముందు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు. ఆ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని రైతుల మేలు కోసం పొలాలకు ఉచిత కరెంట్ హామీని ఇచ్చి ఆ ఎన్నికల్లో గెలిచారు రాజశేఖర్ రెడ్డి గారు. 
 
ఆ తరువాత వరుసగా రెండు సార్లు పరాజయం పాలవటంతో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసారు. ఈ పాదయాత్ర సెంటిమెంట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. రెండోసారి కూడా ఈ సెంటిమెంట్ నిజం కావడంతో ఇదే సెంటిమెంట్ జగన్ ఫాలో అయ్యారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఎవరూ ఊహించని విజయం సాధించాడు. మూడో సారి కూడా ఈ సెంటిమెంట్ నిజమయింది 
 
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తు 2024 ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉండి ముఖ్యమంత్రి స్థానం కోసం పోరాడుతుంది పవన్ కల్యాణ్, చంద్రబాబు . ఈ ఇద్దరిలో ఎవరైనా పాదయాత్ర చేస్తే ఇప్పటిదాకా జరిగిన సెంటిమెంట్ ప్రకారం వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సీఎం అయ్యే అవకాశం ఉంది. మరి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని ముఖ్యమంత్రి కావటానికి ప్రయత్నిస్తారేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: