జగన్ అంటే నవ్వుతూ ఉంటారు. వరాలు ఇచ్చే దేవుడు అనుకోవచ్చు. ఆయనలో ఇది ఒక కోణం. రెండో వైపు చూడాలనుకుంటే మాత్రం మటాషే. జగన్ ఒకటి తలచుకుంటే ఆయనకు ఉన్న పట్టుదల ఏంటి. దాన్ని సాధించేందుకు ఆయన కమిట్మెంట్ ఎంత అన్నది పదేళ్ళ పోరాటాన్ని యావత్తు ఏపీనే కాకుండా దేశం మొత్తం చూసింది.


ఇంతకీ విషయమేంటంటే జగన్ ఇలా సీఎం అయ్యారో అలా తెలంగాణాకు ఏపీ భవనాలు ఇచ్చేశారని తమ్ముళ్లతో పాటు చాలా మంది సన్నాయి నొక్కులు నొక్కారు. మేధావులు అయితే ఇది సరైన నిర్ణయం కాదని కూడా తేల్చారు. అయితే ఇచ్చి పుచ్చుకోవడంలో భాగంగానే స్ట్రాటజీగానే జగన్ ఇలా చేశాడని వారికేం తెలుసు. తెలంగాణాకు జగన్ ఇచ్చింది వాడని భవనాలను, అవసరం లేని వాటిని మాత్రమే.


ఇక వాటా ప్రకారం ఏపీకి రావాల్సిన ఆస్లులు  ఏంటి, వాటి కధ ఏంటి అన్నది జగన్ పెద్ద పద్దులనే వేయిస్తునారని తెలిసింది. ఒక లెక్క ప్రకారం ఏపీకి విభజన ఆస్తులు వేల కోట్లలో ఉంటాయట. వాటి విషయంలో తేల్చుకోవడానికి జగన్ రెడీ అంటున్నారు. ముందుగా ఇచ్చారు కాబట్టి పుచ్చుకునే విషయంలో జగన్ గట్టిగానే ఉంటారట. ఇక కేసీయార్ వంతు ఇవ్వడం. కాదూ కూడదంటే జగన్ రెండవ రూపమే చూస్తారట.


ఓ వైపు కేంద్రం కూడా కేసీయార్ మీద గుర్రుగా ఉంది. దాంతో ఈ పంచాయతీ కేంద్రం వద్దనే పెట్టి మరీ సానుకూలం చేసుకోవడానికి జగన్ వెనుకాడరని అంటున్నారు. చివర్లో న్యాయ పోరాటంగా సుప్రీం కోర్టు తలపు తట్టడానికి కూడా జగన్ తయారు అంటున్నారు. చంద్రబాబులా జగన్ పిరికివారు కాదు, ఆయనపై ఓటుకు నోటు కేసుల్లేవు. పైగా ఇపుడున్న స్థితిలో కేంద్రం మద్దతు కూడా బాగా ఉంది. మరి కేసీయార్ జగన్ కి తగ్గుతారా. ఢీ కొడతారా. వెండి తెరమీద చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: