విచిత్రంగా ఉంది మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యవహారం.  తమ కుటుంబం చేసిన అరాచకరాలపై పోలీసులు కేసులు పెడుతుంటే ప్రభుత్వం తమపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందంటూ దొంగేడుపులు మొదలుపెట్టారు.  స్పీకర్ గా పదవిలో ఉన్నంత కాలం జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి నియోకవర్గాల్లో కుటుంబ సభ్యులు చేయని అరాచకం లేదు.

 

తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని ఒకవైపు కొడుకు మరోవైపు కూతురు అంతులేని అరాచకాలకు పాల్పడ్డారు. భూములు కబ్జా చేశారు. ఇంటిస్ధలాలను లాగేసుకున్నారు. దొంగపత్రాలు సృష్టించి పంటపొలాలను సొంతం చేసేసుకున్నారు. బిల్డర్లు, వ్యాపారులు ఇలా..ఒకరని లేదు. అందని కాడికి అందుబాటులోకి వచ్చిన ప్రతీ ఒక్కరిని బెదిరించి దోచేసుకున్నారు.

 

వాళ్ళ దాష్టికాలకు బలైన బాధితులు ఫిర్యాదులు చేద్దామని పోలీసుస్టేషన్ కు వెళితే పోలీసులు బాధితులపైనే ఎదురు కేసులు పెట్టారు. చచ్చేట్లు కొట్టిచ్చారు. సరే సీన్ కట్ చేస్తే  అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత బాధితులంతా పోలీసు స్టేషన్లకు క్యూ కడుతున్నారు.

 

ఎప్పుడైతే బాధితులు ఫిర్యాదులు వస్తున్నారో వెంటనే పోలీసులు కూడా కేసులు పెట్టేస్తున్నారు. దాంతో తమను అరెస్టు చేయటం ఖాయమని అనుకున్నారో ఏమో కొడుకు, కూతురు పరారీలో ఉన్నారట. మిగిలింది కోడెల మాత్రమే. దాంతో ఎటూ పోలేని కోడెల మాత్రం తమపై ప్రభుత్వం కక్షసాధింపు మొదలుపెట్టిందంటూ కొత్త కథలు వినిపిస్తున్నారు.

 

జరుగుతున్న ప్రచారానికి తమ కుటుంబానికి ఏమీ సంబంధం లేదంటూ బుకాయిస్తున్నారు. తమ కుటుంబం వల్ల ఎవరికీ ఎటువంటి అన్యాయం జరగలేదని చెబుతున్నారు. కావాలనే తమ కుటుంబాన్ని బద్నాం చేస్తున్నట్లు మండిపడుతున్నారు. అంటే కోడెల చెప్పేదెలాగుందంటే బాధితులు చెప్పేదంతా అబద్ధాలని, తాము చెబుతున్నది మాత్రమే నిజాలన్నట్లుగా మాట్లాడుతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: