తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ట్రోల్ జ‌రుగుతూనే ఉంటుంది. ఆయ‌న‌పై వ్యంగ్యాస్త్రా లు సంధించ‌డంలో నెటిజ‌న్లు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇక త‌న‌పై వ‌చ్చిన వాటిని విని లేదా చ‌దివి చిరున‌వ్వు రువ్వ‌డం కేసీఆర్ కు అల‌వాటు. అంతేత‌ప్ప‌.. కొంత మంది ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ నాయ‌కుల్లా సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేసిన వారిపైనా కేసులు పెట్ట‌డం కేసీఆర్ నైజం కాదు. అందుకే కేసీఆర్ సోష‌ల్ మీడియాలో అంత‌గా ఫేమ‌స్ అయ్యారు. 


ముఖ్యంగా కేసీఆర్ ముక్కుపై వ‌చ్చిన‌న్ని కామెంట్లు మ‌రే విష‌యంపైనా రాలేదంటే నిజం! స‌రే.. మ‌రోసారి తాజాగా కేసీఆర్ విష‌యం హాట్ హాట్గా మారింది. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం రావాల‌ని, చంద్ర‌బాబు పాల‌న అంత‌రించాల‌ని కోరుకున్న ప‌క్క‌రాష్ట్ర నాయ‌కుడిగా కేసీఆర్ చ‌రి త్రలో నిలిచిపోతారు. ఇక, ఇటీవ‌ల జరిగిన ఎన్నిక‌ల్లో  జ‌గ‌న్ ఏపీలో విజ‌య‌బావుటా ఎగుర వేశారు. దీనికి వైసీపీ నాయ‌కు లు ఎంత‌లా సంతోషించారో తెలియ‌దు కానీ, కేసీఆర్ మాత్రం త‌న పార్టీనే గెలిచినంతగా ఫీల‌య్యారు. 


ఈ క్ర‌మంలోనే సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన స‌మ‌యంలో నేరుగా విజయ‌వాడ‌కు వ‌చ్చి అభినందించారు. తెలంగాణ నుంచి అన్ని విధాలా సాయం చేస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. అయితే, ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ ను మ‌చ్చిక చేసుకుని, హైద‌రాబాద్‌లో గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పొల్గొన్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణాలో నిరుప‌యోగంగా ఉన్న ఏపీకి సంబంధించిన భ‌వ‌నాల‌ను కేసీఆర్ త‌న ఖాతాలో వేసుకునే వ్య‌వ‌హ‌రించారు. ఎలాంటి ష‌రతులు, ఒప్పందాలు లేకుండానే ఏపీ భ‌వ‌నాల‌ను కేసీఆర్ త‌న బుట్ట‌లో వేసుకున్నారు. ఇది ఒక‌ర‌కంగా ఏపీ ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. 


ఇరు రాష్ట్రాల మ‌ధ్య అనేక స‌మ‌స్య‌లు ఉన్నాకూడా.. కేసీఆర్ త‌న‌కు ల‌బ్ధి చేకూరే విష‌యాన్ని మాత్రం స‌రిచేసుకుని, జ‌గ‌న్ వైపు నుంచిఆలోచించ‌లేద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి.  క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రోసారి కేసీఆర్ విజ‌య‌వాడ వ‌స్తున్నారు. తాడేప‌ల్లిలో స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి స్వామి కార్య‌క్ర‌మానికి హాజ‌రై.. అనంతరం సీఎం జ‌గ‌న్‌ను క‌లుస్తారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి పిలుస్తారు. అయితే, నెటిజ‌న్లు మాత్రం.. ఈ ద‌ఫా ఏం ఎత్తుకు పోత‌రు సామీ! అంటూ ట్రోల్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: