టీడీపీ అధినేత చంద్రబాబు ఘోరంగా ఓడిపోయిన ఆయన వైఖరిలో ఎంత మాత్రం మార్పు రాలేదని శాసనసభ సమావేశాల రెండో రోజునే అర్థమైపోయింది. 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు రెండో రోజే స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు, సంప్రదాయాలను తుంగలో తొక్కడం చూసిన ప్రజ‌లు ఎవరు హర్షించలేదు. కనీసం స్పీకర్ ఎన్నిక సందర్భంగా పాటించాల్సిన సంప్రదాయాలను కూడా పాటించక పోతే ఎలా అన్న ప్రశ్న సగటు పౌరుడు నుంచి కూడా వచ్చింది. 


ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా వైసీపీ నేతలు టిడిపి నుంచి పలువురు తమ పార్టీలోకి గోడ దూకడానికి రెడీగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొందరు ఎమ్మెల్యేలు తమతో నేరుగా టచ్‌లో ఉన్నారని... ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పారు. ఇక ఇప్పుడు అంబటి రాంబాబు వంతు వచ్చింది. చంద్రబాబును ఇంత దారుణంగా ప్రజలు తిరస్కరించినా ఆయన తీరులో ఎంత మాత్రం మార్పు రావడం లేదని... ఈ విషయాన్ని గ్రహించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకునేందుకు రెడీగా ఉన్నారని మరో బాంబు పేల్చారు. 


చంద్రబాబు ఇదే తీరుతో ఉంటే తెలుగుదేశం పార్టీ బలం త్వరలోనే 23 నుంచి 13కి పడిపోతుందని కూడా అంబటి చెప్పారు. చంద్రబాబు వ్య‌వ‌హార శైలీతో తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజలు అసహ్యించుకునే తీరు వచ్చేసిందని... అందుకే ఆయనను ఘోరంగా ఓడించారని, ఆయన నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే ఆ పార్టీ బలం మ‌రో 10కి పైగా మైన‌స్ అవుతుంద‌న్నారు. టిడిపి ఎమ్మెల్యేల తీరు చూస్తుంటే పరమానందయ్య శిష్యుల కథ గుర్తొస్తుందని కూడా అంబటి ఎద్దేవా చేశారు.


ఏదేమైనా తొలి అసెంబ్లీ సమావేశాల్లో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టిడిపిపై అధికార వైసీపీ ఎమ్మెల్యేల ఎటాక్ కంటిన్యూ అవుతూ వస్తోంది. మొత్తానికి ఎనిమిది నుంచి పది మంది టిడిపి ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఏదేమైనా ఈ వార్త తెలుగుదేశం అభిమానులు కూడా తీవ్రమైన ఆందోళన రేకెత్తిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: