ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు చెబితేనే మంచినీళ్లు తాగినంత సులువుగా పార్టీ కండువాలు మార్చేస్తారు అన్న నానుడి ఉంది. గంటా పార్టీలు ఎలా మార్చేస్తారో.. నియోజకవర్గాలు కూడా అలాగే మార్చేస్తుంటారు. పార్టీ మారిన నియోజకవర్గం మారినా గెలుపు మాత్రం ఫైనల్‌గా గంటాను నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఈ విష‌యంలో దటీజ్ గంటా అనాల్సిందే.  1999 నుంచి 2019 వరకు జరిగిన ఐదు ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన  ఐదు నియోజకవర్గాలు మారారు. తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైన గంట రాజకీయ ప్రస్థానం వయా ప్రజారాజ్యం, కాంగ్రెస్ నుంచి తిరిగి తెలుగుదేశంలోకి వచ్చింది. తాజా ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసిన గంటా చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా గెలిచారు. 


గత ఏడు సంవత్సరాలుగా గంటా మంత్రిగా  సాగుతూనే ఉన్నారు. తాజా ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడం ఒక ఎత్తు అయితే... ఆయనపై సవాల్ చేసిన ఆయన పాత మిత్రుడు అవంతి శ్రీనివాసరావు వైసిపిలోకి వెళ్లి రాష్ట్ర మంత్రిగా ఇప్పుడు విశాఖ జిల్లా రాజకీయాలను శాసిస్తుండ‌డం గంటాకు కాస్త మింగుడు పడటం లేదని చెప్పాలి. ఎమ్మెల్యేగా ఉండి ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండటం గంటకు చాలా కష్టమే. ఐదేళ్ల తర్వాత టిడిపికి ఎలాంటి భవిష్యత్తు ఉంటుందన్న దానిపై చాలా సందేహాలు ముసురుకొంటున్నాయి. 


ఈ క్రమంలోనే గంటా మదిలో అప్పుడే కొత్త ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. కీలకమైన విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.  వైసీపీ పట్టు సాధించాలంటే గంటా లాంటి నేత వైసీపీలో ఉంటే చాలా ప్లస్ అవుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆయ‌న్ను నేరుగా పార్టీలో చేర్చుకుంటే జగన్ తాను ఇచ్చిన మాటను చెప్పినట్లవుతుంది. ఈ క్రమంలోనే ఆయన వైసీపీ వైపు చూస్తుండడంతో టీడీపీతో పాటు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసేలా కండీషన్ పెట్టాలన్నదే వైసీపీ ఆలోచనగా తెలుస్తోంది. ఇక గంటా పాత మిత్రుడు ప్రస్తుత ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ విషయంలో చొరవ తీసుకుంటే గంటా వైసీపీలో చేరవచ్చని టాక్. 


గంటా అంటే నేతలు వస్తే కీలకమైన విశాఖ నగరంలో వైసిపికి తిరుగు ఉండదని ఆ పార్టీ వాళ్లు భావిస్తున్నారు. గంటాకే కనుక జగన్ ఓకే చెబితే తన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేసేందుకు సంకోచించర‌ని ఉప ఎన్నికల్లో ఆయన సులువుగా విజయం సాధిస్తారని వైసిపి భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తనతో పాటు మరికొంతమంది కీలక నేతలను సైతం పార్టీలోకి తీసుకు రావచ్చు అని కూడా అంచనా వేస్తున్నారు. ఏదేమైనా గంటా వైసీపీలో చేరిన అంశం ఇప్పుడు అవంతి శ్రీనివాస్ చేతుల్లో ఉందన్నది వాస్తవం. అవంతి కూడా గంటా కోసం తానొప్ప‌క.. ఒప్పించే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: