స్వరూపానంద స్వామీ .. మరో 15 ఏళ్ళు వరకు జగన్ ఏపీకి సీఎంగా ఉంటారని చెప్పుకొచ్చారు. కృష్ణా నదీ తీరంలోని గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో శాస్త్రోక్తంగా దీనిని నిర్వహించారు. సోమవారం సన్యాసదీక్ష ముగింపు కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ పాల్గొన్నారు. సన్యాస దీక్ష స్వీకరించిన కిరణ్ కుమార్ శర్మకు స్వాత్మానందేంద్రగా విశాఖ పీఠాధిపతి నామకరణం చేశారు.


2024లో తన స్థానంలో స్వాత్మానందేంద్ర పీఠాధిపతి బాధ్యతలు చేపడతారని స్వరూపానంద ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌లపై స్వరూపానంద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్, కేసీఆర్ అంటే నాకు ప్రాణం. కేసీఆర్ మేధావి, ఆయన మహాభారతాన్ని రెండుసార్లు చదివారు. మహాభారతం చదివి సీఎం అయిన ఏకైక వ్యక్తి ఆయన. యాదాద్రిని రాతి దేవాలయంగా మలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ చేసిన యాగాలు.. హిందూత్వవాద పార్టీలు కూడా చేయలేదు.


ఆయనకు నేనంటే ప్రాణం’’ అని స్వరూపానంద చెప్పారు. ‘‘ఇంత మంది ముందు అగ్నిసాక్షిగా చెబుతున్నా.. నా హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. జగన్ అంటే నాకు పరమ ప్రాణం. ఆయన కోసం విశాఖ శారదా పీఠం ఐదేళ్లు శ్రమించింది. శారదా పీఠం జగన్‌ అంటే ప్రాణం పెట్టింది. అక్కడ దేన్ని కదిపినా.. జగన్ గెలవాలి, రాష్ట్రానికి మంచి చేయాలని కోరుకుంది. ఇటు జగన్, అటు కేసీఆర్ 15 ఏళ్లు దిగ్విజయంగా తెలుగు రాష్ట్రాలను పాలించాలని కోరుకుంటున్నా. అంత వరకు శారదాపీఠం తపస్సు చేస్తూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: