చందన దీప్తి ఐపీఎస్, 2012 సివిల్స్ టాపర్. ప్రస్తుతం మెదక్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్నారు. తెలివిలోనే కాదు అందంలోనూ ఏ మాత్రం తీసిపోదు. ఈమెని చూసి చూపు తిప్పుకోలేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! తెలంగాణలో ఇప్పుడున్న యువ అధికారుల్లో ఈమె ఎంతో ఉత్సాహంగా పని చేస్తారు. మెదక్ జిల్లా ఎస్పీగా జిల్లాలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టడం మాత్రమే కాదు జిల్లాలో నేరాల శాతాన్ని కూడా తగ్గించి ఉన్నతాధికారుల చేత శబాష్ అనిపించుకున్నారు. 
డిజిటల్ పోలీసింగ్ సంస్కరణలో భాగంగా సోషల్ మీడియా వేదికల్లో పోలీసులు యాక్టీవ్ ఉండేలా చేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉంచటంలో విజయవంతమయ్యారు. అంతే కాదు ఒక జిల్లా ఎస్పీగా ఈమె కూడా తన వంతుగా అనేక సోషల్ మీడియా వేదికల్లో పాలు పంచుకుంటూ నిరుద్యోగులను, యువకులను ప్రోత్సహిస్తూ వారికి అనేక ఉత్తేజపరిచే సందేశాలు ఇస్తూ ఉంటారు. అందుకే ఈమెకు చాలా తక్కువ సమయంలోనే యువతలో మంచి క్రేజ్, ఫాలోయింగ్ వచ్చేలా చేసింది.
ఇప్పుడు ఈమె సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. కారణం ఈమెకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమట. ఒక యూట్యూబ్ ఛానెల్ చేసిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆమెకు లవ్ మ్యారేజ్ చేసుకోవటం అంటే చాల ఇష్టమని కానీ ఇంటర్నెట్ లో ఆమెకు పెళ్లి అయినట్టుగా తప్పుడు వార్తలు పెడుతుండటంతో తనకు సరైన వ్యక్తి దొరకటం లేదని వాపోయారు. తనకు కాబోయే వ్యక్తి ఈ తప్పుడు వార్తలు చదువుతుండటం వల్లే తనను పట్టుకోలేకపోతున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: