అత్యంత విశ్వసనీయ సమాచారంతో...ఏపీ హెరాల్డ్ ఇచ్చిన వార్తా క‌థ‌నం నిజమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీసుకోబోయే నిర్ణ‌యం గురించి ఏపీ హెరాల్డ్ ఇచ్చిన ఖ‌చ్చిత‌మైన వార్త తాజాగా జీఓ రూపంలో వెలువ‌డింది. మొదటి నుంచి త‌న‌ వెంట నిలిచిన సజ్జల రామకృష్ణా రెడ్డికి వైఎస్ జ‌గ‌న్ కీల‌క పోస్టు క‌ట్ట‌బెట్ట‌నున్నార‌ని, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి ఆయ‌న ఆత్మీయుడు కేవీపీ రామచందర్‌రావు వ్య‌వ‌హరించిన‌టువంటే ప్రాధాన్య పోస్టును కేటాయించ‌నున్నార‌ని `ఏపీ హెరాల్డ్` రాసిన క‌థ‌నం నిజ‌మైంది.

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారుగా సజ్జల రామకృష్ణా రెడ్డి నియ‌మితులు అయ్యారు. సజ్జలకు కెబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జర్నలిస్టుగా అపార అనుభవం ఉన్న  రామకృష్ణారెడ్డి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుగా, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలోనూ ఆయన పనిచేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి నియమాకం తక్షణం అమలులోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొంది.  సాక్షి ఆవిర్భావం దగ్గర నుంచి ఆ సంస్థ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. ఆవిర్భావం దగ్గర నుంచి ఆ మీడియా ద్వారా పార్టీ  వాయిస్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.  ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్‌గా వ్యవహరించి అటు టెలివిజన్ కు ఇటు పత్రికకు సజ్జల రామకృష్ణారెడ్డి ఈడీగా ద‌శాదిశ నిర్దేశించారు. ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఆ సంస్థ ఉన్నతిలో కీలక పాత్ర పోషించారు.

 

 

త‌న తండ్రి దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న ఆప్తుడు కేవీపీ రామ‌చంద్ర‌రావుకు క‌ల్పించిన కీల‌క హోదానే  జ‌గ‌న్ మీడియా సంస్థ అయిన సాక్షిలో కీల‌క పాత్ర పోషించ‌డంతో పాటుగా త‌న పార్టీ ఆవిర్భావం నుంచి అండ‌గా ఉన్న స‌జ్జ‌ల‌కు క‌ల్పించ‌నున్నార‌ని ఏపీ హెరాల్డ్ వెల్ల‌డించింది. వైసీపీలోని విశ్వ‌సనీయ‌వ‌ర్గాల‌ను పేర్కొంటూ రాసిన ఈ వార్తాక‌థ‌నం తాజాగా నిజ‌మైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: