చంద్రబాబు అంటేన అలా ముందుకుపోతున్నాం అన్నది కామన్ డైలాగ్. ఆయన ముందుకు పోవడమే కాదు. అందరినీ అలా పొమ్మంటారు. ఎక్కడికి అని అడగవద్దు. ఆ ముందు ఏంటో బాబుకే తెలుసు. దాన్ని అందుకోవడానికి ఆయన పదండి ముందుకు అని అందర్నీ తొందరపెట్టి తాను మాత్రం వ్యూహాత్మకంగా  అడుగులు వేస్తారు.


ఇపుడు బాబు మాత్రం రివర్స్ గేర్ అంటున్నారు. పార్టీ దారుణంగా ఓడిపోయాక బాబు బండి నాలుగు అడుగులు వెనక్కు నడుస్తోంది. ఎందుకో తెలియదు కానీ బాబు గారి దూకుడు తగ్గిపోయింది. అసలు అసెంబ్లీలో ఆయన ఉన్నారా అన్నది కూడా అర్ధం కాదు. పూర్తి మౌనం. వచ్చామంటే వచ్చాం ఇదీ కదా విధానం.


మరి బాబు  కావాలని తగ్గారా, నిజంగా తగ్గిపోయారా అన్నది అర్ధం కావడంలెదని తమ్ముళ్ళు అంటున్నారు. అయితే బాబు ఓటమిని సులువుగా అంగీకరించరు. ఆయనలో గొప్ప పోరాట యోధుడు ఉన్నాడు. ఆయన వెనకబడినట్లుగా కనిపించినా సునామీలా ముందుకు వస్తారని పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికైతే బాబు మాత్రం బాగా వెనకబడ్డారు. ఇది వ్యూహాత్మకమే అయితే మాత్రం జగన్ రెడ్డి జాగ్రత్త పడడం మంచిదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: