తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గ్లాస్‌హౌస్‌ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక గ్లాస్‌హౌస్‌ సెంటర్‌లో ఉన్న ఓ సూపర్‌ మార్కెట్‌లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. మూడు అంతస్తులకు ఈ మంటలు వ్యాపించడంతో దాదాపు రూ.2 కోట్ల వరకూ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నాలుగు అగ్నిమాపక శకటాలతో మంటలార్పుతున్నారు. మంటల తీవ్రత చేయిదాటిపోవడంతో పెద్దాపురం, పిఠాపురం నుంచి మరో నాలుగు అగ్నిమాపక శకటాలను తరలించినట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు.

సూపర్ మార్కెట్ లో ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు. భవనం ఇరుకు ప్రాంతంలో ఉండడం వల్ల చుట్టు పక్కలకు వెళ్లే వీలు లేకుండా ఉందని, ముందు నుంచే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ భవనానికి ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేవని తెలిపారు. భవనంలో ప్లాస్టిక్‌, స్కూల్‌ బ్యాగులు, బట్టల దుకాణాలు ఉండడంతో మంటల తీవ్రత బాగా పెరిగిందని అధికారులు అంచనా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: