గత ఐదేళ్ళు సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాడు చంద్రబాబు. ప్రత్యేక హోదా మీద చాలా సార్లు మాట మార్చాడు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ వలనే ఉపయోగాలు ఉంటాయని ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాడు. కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు మాత్రం ఆ ప్యాకేజీ వలన ఎలాంటి ప్రయోజనాలు కలగలేదు. 
 
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరం. ఇప్పటికే నీతి అయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదా యొక్క ఆవశ్యకతను జగన్ వివరించారు. అసెంబ్లీ సమావేశంలో కూడా ప్రత్యేక హోదా కోసం తీర్మానం పెట్టి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్యాకేజీ వద్దు అని హోదానే కావాలని జగన్ అసెంబ్లీ సమావేశాల్లో ఆ తీర్మానాన్ని ఆమోదించేలా చేసాడు. 
 
కానీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం మొదటినుండి ప్రత్యేకహోదాకు వ్యతిరేకంగానే ఉంది. చంద్రబాబు నాయుడు కూడా హోదా కోసం పోరాటం చేసాడు కానీ హోదా మాత్రం సాధించలేకపోయాడు. జగన్ గారు మాత్రం మొదటినుండి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం కూడా గతంతో పోలిస్తే నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు మెరుగ్గానే సాయం చేస్తుంది. మరి చంద్రబాబు సాధించలేనిది జగన్ సాధిస్తాడో లేదో చూడాలి 



మరింత సమాచారం తెలుసుకోండి: