- కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో వైసీపీ
- బాబు 40ఏళ్ల అనుభవానికి పరీక్ష! 
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. కేంద్రంలో బీజేసీ... రాష్ట్రంలో వైసీపీతో తీవ్రంగా అంతర్ఘత రాజకీయ యుద్దం చేస్తోంది. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు కేంద్రంలో మోదీ..ఏపీలో జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా పోరాడిన చంద్ర‌బాబుకు తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. అందులో భాగంగా..టీడీపీ ఏపీలో కేవ‌లం 23 సీట్ల‌కే ప‌రిమితి కావ‌టం తో ఆ పార్టీలోని నేత‌లు ఒక ర‌కంగా రాజ‌కీయంగా అభ్ర‌ద‌తా భావంతో ఉన్నారు. అదే విధంగా ఇప్ప‌టికే కొంద‌రు ఎంపీ లు బీజేపీతో టచ్‌లోకి వెళ్లార‌నే వార్త‌లు చంద్ర‌బాబును క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి.

కేంద్రంలో మోదీ-అమిత్ షా ఇద్ద‌రూ త‌మ పార్టీ ఎంపీల‌ను లాగేసుకుంటార‌ని ముందు నండీ చంద్ర‌బాబు అంచనా వేస్తూనే ఉన్నారు. అయితే, ఏపీ లో మాత్రం జ‌గ‌న్ త‌న‌ంతట తానుగా ఫిక్స్ చేసుకున్న విధానాల కార‌ణంగా ఇప్ప‌టికిప్పుడు ఇబ్బంది లేద‌ని..అయితే వైసీపీ పాల‌న‌లో లోపాలు లేక‌పోతే..భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి..అటు ఢిల్లీలో ఇటు అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు త‌న టీం ను ఎలా కాపాడుకుంటారో చూడాలి. అక్క‌డ ఢిల్లీలో బీజేపీ..ఏపీలో వైసీపీ ఇప్పుడు చంద్ర‌బాబును టెన్ష‌న్ పెడుతున్నాయి. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఢిల్లీలో బీజీపీ చీఫ్ అమిత్‌షాతో క‌ల‌వ బోతున్నారు. ఇంత‌కీ ఏం జ‌రుగుతోంది. 


రాజ్యసభాపక్షనేతగా కేంద్రమంత్రి థవార్‌చంద్ గెహ్లాట్‌కు దక్కిన అవకాశం. పార్ల‌మెంట్ స‌భ్యులే టార్గెట్‌గా.. పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో టీడీపీ స‌భ్యులను బీజేపీ టార్గెట్ చేసింది. వారిని త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. రాజ్య‌స‌భ‌లో ఇప్ప‌టికే బీజేపీ సంఖ్య ప‌రంగా మైనారిటీలో ఉంది. దీంతో..ఇత‌ర పార్టీల నుండి త‌మ వైపుకు వ‌చ్చే వారిని గుర్తించే ప‌ని మొద‌లు పెట్టింది. ఇందులో భాగంగానే రాజ్య‌స‌భ లో టీడీపీ ఎంపీలు ఆరుగురి పైన దృష్టి పెట్టిన‌ట్లు చెబుతున్నారు. అందులో ముగ్గురు ఎంపీలు ఇప్ప‌టికే బీజేపీతో ట‌చ్ లోకి వెళ్లిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

టీడీపీ ఎంపీలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేర‌టం గ‌త చ‌రిత్ర అధ్య‌య‌నం చేసిన వారికి ఆశ్చ‌ర్య అనిపించ‌దు. అదే విధంగా లోక్‌స‌భ‌లో ప్ర‌స్తుతం టీడీపీకి ముగ్గురు స‌భ్యులుండ‌గా ..వారిలో ఒక‌రు ఇప్ప‌టికే బీజేపీతో ట‌చ్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఏపీలో టీడీపీకి తాజా ఎన్నిక‌ల్లో 23 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంది. అదే విధంగా..వైసీపీలో 35 మంది స‌భ్యులుగా ఉన్నారు. అయితే, స్పీక‌ర్ ఎన్నిక స‌మ‌యంలో స‌భా సాక్షిగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌తో టీడీపీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని స్ప‌ష్టంగా చెప్పారు. అయితే, సంఖ్య మాత్రం తాను చెప్ప‌న‌ని తేల్చారు.

ఇక‌, వైసీపీ నేత‌లు సైతం 8 మంది వైసీపీతో ట‌చ్‌లో ఉన్నార‌ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో టీడీపీ ఎమ్మెల్సీలు సైతం ఇద్ద‌రు ఇప్ప‌టికే వైసీపీ నేత‌ల‌తో మంత‌నాలు చేస్తున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. అయితే, వారికి ఉన్న ప‌ద‌వుల‌ను వీడ‌టం తో పాటుగా పార్టీకి రాజీనామా చేసి వ‌స్తేనే వైసీపీలోకి ఎంట్రీ ఉంటుంద‌ని జ‌గ‌న్ ఇప్పటికే స్ప‌ష్టం చేసారు. దీంతో.. టీడీపీ కొంత ఊపిరి పీల్చుకుంటున్నా..ఖ‌చ్చితంగా జ‌గ‌న్ మాత్రం త‌మ‌ను దెబ్బ తీస్తార‌నే ఆందోళ‌న లోలోప‌ల టీడీపీ ముఖ్య నేత‌ల‌ను వెంటాడుతూనే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: