చంద్ర‌బాబుకు చిన్న అవ‌కాశం కూడా లేదు.. అస్స‌లే దొర‌క‌లేదు.. అందుకే స‌భ‌లో చిన్న‌బోయి కూర్చున్న బాబు క‌న్నార్ప‌కుండా.. ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ హుందా త‌నాన్ని చూడ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేని.. మ‌రేమీ మాట్లాడ‌లేని ప‌రిస్థితి ఎదురైంది. త‌న‌కు దేశంలోనే సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌ని, 14ఏళ్ల‌పాటు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశానంటూ.. చెప్పుకునే బాబుకు జ‌గ‌న్ ఏ చిన్న అవ‌కాశం కూడా ఇవ్వ‌కుండా మొద‌టి అసెంబ్లీ స‌మావేశాలను న‌డిపించిన తీరుపై అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 


ఇదే స‌మ‌యంలో ఎమ్మెల్యేల ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత స్పీక‌ర్ ఎన్నిక‌, స‌భా సంప్ర‌దాయాల‌ను కాద‌ని స్పీక‌ర్‌ను గౌర‌వించ‌ని బాబుపై ప్ర‌జ‌ల్లో మ‌రింత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న బాబు.. ఇలాగేనా వ్య‌వ‌హ‌రించేదంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. నిజానికి.. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై బాబు అనేక విమ‌ర్శ‌లు చేశారు. ప‌రిపాల‌నా అనుభ‌వం లేద‌ని, అలాంటి వారికి అధికారం క‌ట్ట‌బెట్టితే రాష్ట్ర భ‌విష్య‌త్ ఆగ‌మ‌వుతుంద‌ని.. ఇలా అనేకానేక విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ.. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ న‌డ‌వ‌డిక‌ను స్వ‌యంగా చూసిన జ‌నం.. బాబును, ఆయ‌న మాట‌ల్ని ప‌ట్టించుకోలేదు. ఏక‌ప‌క్షంగా తీర్పునిచ్చారు. వైసీపీకి అండ‌గా నిలిచారు. 


ప్ర‌జావ్య‌తిరేక పాల‌న అందించిన చంద్ర‌బాబును ఈడ్చిప‌డేశారు. అయితే.. మొద‌టి స‌మావేశాల్లోనే ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ వ్య‌వహ‌రించిన తీరుపై ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఎక్క‌డ కూడా చిన్న‌పొర‌పాటుకు తావులేకుండా స‌భ‌ను న‌డిపించిన తీరుపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైలెంట్ గా కూర్చోవ‌డం త‌ప్ప మాట్లాడడానికి ఏమీ లేకుండా పోయింది. 23మంది ఎమ్మెల్యేల్లో కేవ‌లం ఇద్ద‌రు ముగ్గురు మాత్ర‌మే మాట్లాడారు. ఇక ఇదే స‌మ‌యంలో వైసీపీ ఎమ్మెల్యేలు చంద్ర‌బాబుపై, ఆయ‌న గ‌త‌ పాల‌న‌పై విరుచుకుప‌డ్డారు. 


చివ‌రికి.. ప‌రిస్థితిని గ‌మ‌నించిన బాబు.. చివరి రోజున ఎన్నికైన డిప్యూటీ స్పీకర్ ను ముఖ్యమంత్రి జగన్‌తో సహా వెళ్లి స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టారు. తాము ప్ర‌త్యేక హోదా సాధించ‌లేక‌పోయామ‌ని, హోదా కోసం మీరు చేసే ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని బాబుగారు స‌భ‌లో ప్ర‌క‌టించారు. మ‌రోవైపు.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం కూడా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలుచేసే విధంగా ఉండ‌డంతో విమ‌ర్శించే అవ‌కాశం బాబుకు లేకుండా పోయింది.. ఇక ముందుముందు కూడా బాబు సైలెంట్‌గా కూర్చోవ‌డం త‌ప్ప చేయ‌గ‌లిగిందేమీ లేద‌ని జ‌నం అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: