సమాజంలో చట్ట వ్యతిరేక పనులు జరుగుతుంటే అదుపులోకి తీసుకు వచ్చి..సమాజంలో ప్రతి ఒక్కరూ గుండె మీద చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయేలా చేసేవారు పోలీస్.  అలాంటి పోలీసులు డ్యూటీ ఎక్కారంటే..ఇంటికి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు..ఎక్కడికి వెళ్తారో తెలియదు..అసలు సెలవులు ఉంటాయా? వారి కుటుంబ సభ్యులతో కనీసం ఒక్కరోజు ప్రశాంతంగా గడుపుతుంటారా..? లేదనే సమాధానం వస్తుంది.  అయితే పోలీసులకు వారాంతపు సెలవు కావాలని ఎన్నో ప్రభుత్వాల వద్ద విన్నపాలు వస్తూనే ఉన్నాయి..కానీ పరిష్కారం మాత్రం శూన్యం. 

తాజాగా ఏపి పోలీసులకు శుభవార్త..దశాబ్దాలుగా పెండింగ్ లో ఉండిపోయిన పోలీసులకు వీక్లీ ఆఫ్ సదుపాయం ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దగ్గరైంది. రాష్ట్రంలో నేటి నుంచి వారాంతపు సెలవు అమలులోకి రానుండగా, కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయిలోని వారంతా వారంలో ఒకరోజు పూర్తిస్థాయిలో కుటుంబంతో గడిపే అవకాశం దగ్గరైంది. దాంతో పోలీస్ కుటుంబాల్లో ఆనందాలు వెల్లువిరిసాయి..ఈ సందర్భంగా ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు..ఆయన చేసిన మేలు మరువబోమని అంటున్నారు పోలీసులు కుటుంబ సభ్యులు. 

అయితే పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఉన్న సిబ్బంది, వారు చేసే పని తదితరాల ఆధారంగా 19 రకాల ఆప్షన్స్‌ తో వారాంతపు సెలవును అమలు చేసేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా, వాటికి ఆమోదముద్ర పడింది.ఎవరు ఎప్పుడు సెలవులో ఉంటారన్న విషయం ఉన్నతాధికారులకు తెలిసేందుకు ఓ ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌ సైతం సిద్ధమవుతోంది. ప్రతి యూనిట్‌ ఆఫీసర్‌ ఈ 19 ఆప్షన్స్ లో ఒకదాన్ని తాను ఎన్నుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: