ఒక దేశం ఒకే ఎన్నిక ఆలోచనతో చాలా పార్టీలు ఏకీభవించాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇక రెండు కమ్యూనిస్ట్ పార్టీలు విధానాలతో విభేదించినప్పటికీ, ఆలోచనతో మాత్రం విభేదించలేదని తెలిపారు. దీని అమలును మాత్రమే విబేధించినట్లు ఆయన చెప్పారు. ఇక ఈ అంశంతో పాటు జాతిపిత మహాత్మాగాంధీ 150వ వేడుకలను ఎలా నిర్వహించాలి అనే ఇతర అంశాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించడం జరిగిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.

అఖిలపక్ష సమావేశానికి 21పార్టీల అధినేతలు హాజరయ్యారు. మొత్తం 40 పార్టీల అధినేతలను కేంద్రం పిలిచింది.ఇందులో 21 పార్టీలు హాజరయ్యాయి. మరో మూడు పార్టీ లు తమ అభిప్రాయాన్ని లేఖ ద్వారా తెలిపాయి. ఈ సమావేశానికి ఎన్డీయే మిత్రపక్షం శివసేనతో పాటు పలు విపక్ష పార్టీలు హాజరుకాలేదు. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కొందరు నేతలు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు.

ఈ సమావేశానికి గైర్హాజరైన వారిలో:

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ,
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్,
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌
ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడ్ ప్రతిపక్షం డీఎంకే
బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉన్నారు.

లాంటి ప్రముఖులు ఉన్నారు.

హాజరైన వారిలో ఎన్సీపీ నేత శరద్‌పవార్, సీతారాం ఏచూరి (సీపీఎం), సురవరం సుధాకర్‌రెడ్డి (సీపీఐ), ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్, ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ నేత నవీన్‌ పట్నాయక్, సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ (శిరోమణి అకాలీదళ్‌), కోనార్డ్‌ సంగ్మా (నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ) ఉన్నారు.

పార్లమెంటు హౌస్‌ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ భేటీలో పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు హాజరయ్యారు. మోదీ, రాజ్‌నాథ్‌లతో పాటు ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, ప్రహ్లాద్‌ జోషి, బీజేపీ కొత్త కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు.

ఒక దేశం ఒకేసారి ఎన్నికలు అనే నినాదాన్ని అమలు పెట్టడంలో కసరత్తును తీవ్రం చేసింది భారతీయ జనతా పార్టీ. తొలిసారి అధికారంలోకి రాగానే కమలనాథులు ఆ నినాదం వినిపించారు. అయితే అది అప్పుడు వర్కవుట్ కాలేదు. అప్పుడు ఆ విషయంలో గట్టిగా ముందుకు వెళ్లలేకపోయింది బీజేపీ.

అయితే ఈ సారి అధికారం దక్కగానే కమలనాథులు అందుకు సంబంధించిన పని మొదలు పెట్టారు. అందులో భాగంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశా నికి వివిధ పార్టీల నేతలను పిలిపించారు. వారితో సమావేశం అనంతరం కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ తాము ఒకే దేశం, ఒకే ఎన్నికలకు కట్టుబడినట్టుగా ఆయన ప్రకటించారు.

అందుకు దాదాపుగా అన్ని పార్టీలూ ఓకే చెప్పాయని కూడా ఆయన అన్నారు. ఇరవై నాలుగు పార్టీల్లో కేవలం మూడు మాత్రమే ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉన్నాయని, మిగతా వాళ్లంతా సమ్మతం తెలిపినట్టుగా రాజనాథ్ సింగ్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆయన తెలిపారు. మొత్తానికి ఒక దేశం ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు అనే నినాదానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి, దాన్ని అనుకున్నట్టుగా సాధించే ప్రయత్నంలో విజయం సాధించబోతుందా! 

ఒక దేశం - ఒక ఎన్నిక పై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. అయితే ఒక దేశం - ఒక ఎన్నిక పై ప్రధాని మోడీ ఒక కమిటీని ఏర్పాటు చేసి సాధ్యసాధ్యాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా కోరుతారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత రాజనాథ్ మాట్లాడారు. సంబంధిత వ్యక్తులతో చర్చించిన తర్వాత ప్రధాని దీనిపై ఒక నిర్ణయం తీసుకుని కమిటీ వేస్తారు. అది కూడా నిర్దేశిత సమయంలోనే నివేదిక ఇవ్వాలని ప్రధాని సూచిస్తార ని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పారు.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: