ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఢిల్లీకి ఏపీకి నిన్నటి వరకూ వైసీపీకి ఎంతో దగ్గర. ఈ రోజు మాత్రం ఒక్కసారిగా దూరం పెరుగుతోంది. వ్యవహారంలో వేడి రాజుకుంటోంది.  పొలిటికల్ మసాలా  బాగా ఘాటెక్కుతోంది. జగన్ని ఒంటరి చేసే వ్యూహాలకు పదును పెడుతున్నారా...


జగన్ ఏపీ సీఎం, మోడీతో బాగా సన్నిహితంగా ఉంటున్నారు. పార్టీ ఎంపీలకు కూడా ఆయన అదే చెబుతున్నారు. కేంద్రంలో సఖ్యతగా ఉండాలి. లేకపోతే పని జరగదు. ఇప్పటివరకూ వైసీపీకి బీజేపీ బాగా విలువ ఇస్తూ వచ్చింది. అయితే కేంద్రంలో అధికారాన్ని జగన్ ఇప్పటికిపుడు పంచుకోలేరు. ప్రత్యేక హోదా అన్నది ఆయన మెడ మీద కత్తిలా ఉంది. హోదా ఇస్తే ఒకే అని జగన్ అన్నా అమిత్ షా మోడీ ససేమిరా అంటున్నారు.


ఈ లోగా టీడీపీ నుంచి వేగంగా పావులు కదిలాయి. గత సర్కార్లో మోడీ పక్కన మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి ఇపుడు బీజేపీలో చేరుతున్నారు. ఆయన మళ్ళీ కేంద్ర మంత్రి అయినా ఆశ్చర్యపోనక్కరలేదు. పైగా ప్రత్యేక  హోదా ఏమీ అవసరం లేదని ఈసారి బీజేపీ వేషంలో ఏపీకి వచ్చి గట్టిగా డబాయించగలరు. అలాగే ఏపీకి నిధులు ఇవ్వకుండా అడ్డుపుల్లా వేయగలరు.


ఇక ఏపీలో సొంతంగా బీజేపీని దున్నేస్తామంటూ హామీలు ఇచ్చి మరీ ఏపీలో వైసీపీని ఇరుకున పెట్టేయగలరు. సుజన, సీఎం రమెష్ బీజేపీలో కనిపించే టీడీపీ మనుషులు అన్న ప్రచారం బలంగా ఉంది. అంటే మోడీ ఆదేశం అంటూ బయటకు, బాబు ఆదేశాలతో లోపలా ఇలా జగన్ మీదకు దూసుకు వచ్చేందుకు సుజన బాణం రెడీ అవుతోంది. జగన్ జర జాగ్రత్త.
 


మరింత సమాచారం తెలుసుకోండి: