దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో మోడీ ప్రభంజనం మామూలుగా లేదు.  ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో పోటీ చేసిన స్థానాల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది.  గత ఐదేళ్లలో మోడీ ప్రజలకు అందించిన సుస్థిర పాలనే ఇందుకు కారణం అని..అందుకే మోడీమే మరోసారి ప్రజటలు పట్టం కట్టారని అన్నారు.  ఇదిలా ఉంటే ఏపిలో ఎన్నికలు వార్ వన్ సైడ్ అనేలా వచ్చింది.

  గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు..ఈసారి ఎన్నికల్లో బాగా దెబ్బ తీశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  దాంతో ఇప్పుడు టీడీపీ వైపు తెలుగు తమ్ములు విముఖత చూపిస్తున్నారు.  ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే.  తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసి టీడీపీ లెజిస్లేటివ్ పార్టీ విలీనం లేఖ  అందజేసిన  తెలుగుదేశం పార్టీ  రాజ్యసభ ఎంపీలు . బీజేపీలో విలీనం చేయాలని  లేఖ సమర్పించిన ఎంపీలు విజ్ఞప్తి చేశారు. 

ఈ సమావేశంలో  కేంద్ర హోం శాఖ సహాయ  మంత్రి కిషన్ రెడ్డి,  బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్  జేపీ నద్ద , టిడిపి లెజిస్లేటివ్ పార్టీ నీ బిజెపిలో విలీనం చేస్తూ తీర్మానించారు.  10 వ షెడ్యూల్ నాలుగో పేరా ప్రకారం విలీనం చేయాలని లేఖ ఈ లేఖ లో పేర్కొన్నారు. 


ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం తో ప్రేరణ పొందామని..దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని పార్టీని విలీనం చేస్తున్నాం ఎంపీలు అంటున్నారు.  ఇక నుంచి మమ్మల్ని బిజెపి ఎంపీలుగా గుర్తించాలి... మా పార్టీ విలీనం అంగీకరించాలని  బిజెపి అధ్యక్షుడి కి , రాజ్యసభ చైర్మన్ కి లేఖ రాసి, తీర్మానం ప్రతి పై సంతకం చేసిన ఎంపీలు సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్ గరికపాటి మోహన్ రావు, చివరి నిమిషంలోఎంపి సీత రామలక్ష్మి మనసు మార్చుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: