దేశంలో...త‌న‌కంటే సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త ఎవ‌రూ లేర‌నే డ‌బ్బా కొట్టుకునే ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు...రాజ‌కీయాలను ఎలా డబ్బుమ‌యం...స్వార్థ‌పు రాజ‌కీయాల‌కు సుప‌రిచితం చేశారో...తాజా సంఘ‌ట‌న‌తో అర్థ‌మ‌వుతోంద‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా న‌లుగురు ఎంపీలు టీడీపీ రాజీనామా చేస్తూ..మూకుమ్మ‌డిగా బీజేపీలో చేరుతున్న నేప‌థ్యంలో... చంద్ర‌బాబు రాజ‌కీయాల‌ను షేర్ మార్కెట్ చేశారంటూ ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉంటే కొనుగోలు చేయ‌డం...ప్ర‌తిప‌క్షంలో ఉంటే అమ్మేయ‌డం బాబు నైజామ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. 

 

బాబు కొనుగోళ్ల‌ ఉదంతాన్ని ప్ర‌స్తావిస్తూ...2014 ఎన్నిక‌ల ఫ‌లితం అనంత‌రం ఉదంతాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. 2014లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను పెద్ద ఎత్తున ప్ర‌లోభాల‌కు గురి చేసిన చంద్ర‌బాబు వారిలో 23 మంది ఎమ్మెల్యేల‌ను, 3 ఎంపీల‌ను త‌న గూటికి చేర్చుకున్నారు. ఈ నిర్ణ‌యం అప్ర‌జాస్వామికం ఎందరు అన్న‌ప్ప‌టికీ...బాబు త‌న అక్ర‌మ సంపాద‌న‌తో కొనుగోల్ల ప‌ర్వాన్ని కొన‌సాగించారు. న‌వ్విపోదురుగాక నాకేమీ సిగ్గు అన్న‌ట్లుగా బాబు గారి రాజ‌కీయ విలువ‌ల‌ను దిగ‌జార్చే ప‌ర్వం కొనసాగించారు. అయితే, దానికి త‌గిన‌ట్లుగానే...ఈ ఎన్నిక‌ల్లో బాబుకు ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పార‌నుకోండి. తాజాగా వెలువ‌డిన ఫ‌లితాల్లో బాబు గెల‌చుకున్న‌ది 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీల‌నే. స‌రిగ్గా వైసీపీ నుంచి ఎంద‌రిని పార్టీ నుంచి ఫిరాయింప‌చేశారో....అంతేమందిని మాత్ర‌మే గెలిపించారు.

 

ఇక‌, బాబుగారి అమ్మ‌కం విష‌యానికి వ‌స్తే..తాజాగా న‌లుగు ఎంపీలు పార్టీ మార‌డం ఆయ‌న అమ్మ‌కంలో భాగ‌మంటున్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఈ ముగ్గురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువాలు కప్పి జేపీ నడ్డా వీరిని సాధరంగా ఆహ్వానించారు. అనారోగ్య కారణంగా ఎంపీ గరికపాడి మోహన్‌రావు వీరితో పాటు నేడు బీజేపీలో చేరలేదు. రానున్న రెండు, మూడు రోజుల్లో ఆయన బీజేపీలో చేరనున్నారు.ఈ న‌లుగురిలో ఒక్క టీజీ మిన‌హా మిగ‌తా ముగ్గురు బాబు కోట‌రిలో ముఖ్యులే. అలాంటి వారు బీజేపీలో చేరారంటే బాబు గారి అమ్మ‌క‌మే కార‌ణ‌మ‌ని ఇంకొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: