వైసీపీ ఇపుడు ఏపీ రాజకీయాల్లోనే కాదు, జాతీయ స్థాయీలోనూ మారుమోగుతోంది. అద్భుతమైన విజయం ఆ పార్టీ సొంతం అయింది. అదే సమయంలో గత ఇరవై రోజుల జగన్ పాలన, ఆయన మంత్రి వర్గ కూర్పు వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ కలసి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. జగన్ సమర్ధుడు అన్న భావన జనల్లోకి వెళ్తోంది. అనుభవంలేమి అన్నది ఎక్కడా కనబడడంలేదని, తండ్రి వైఎస్సార్ బాటలో ఎటువంటి తడబాటూ లేకుండా జగన్ సీఎం గా దూసుకుపోతున్నారని అంటున్నారు.


ఇక ఏపీలో ఆశాదీపంగా వైసీపీ ఉంది. ఆ పార్టీలో చేరేందుకు పలువులు నాయకులు  రెడీగా ఉన్నారు. ముందు టీడీపీ  ఎమ్మెల్యేలే క్యూ కడుతున్నారు. అయితే జగన్ రాజీనామా చేసి వస్తేనే అన్న షరతు పెట్టడంతో వారంతా డిజప్పాయింట్ అయ్యారు. బీజేపీ వైపు చూస్తున్నా కూడా  ఆ పార్టీకి ఏపీలో ఉనికి లేదు. ఉన్నంతలో సర్దుకుపోవడమేనని ఎమ్మెల్యే తమ్ముళ్ళు అనుకుంటూంటే ఓడిన టీడీపీఎనేతలకు మాత్రం వైసీపీ రెడ్ కార్పెట్ పరుస్తోందట.


టీడీపీలో బలమైన నాయకులుగా ఉండి ఓడిన వారిని పార్టీలో తీసుకోవడం ద్వారా అక్కడ వైసీపీని పటిష్టం చేసుకోవచ్చు, టీడీపీకి కుదేలు చేయవచ్చు అన్న ఆలోచనతో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. దాంతో ఓడిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటోందని టాక్. వారు చేరినా పదవులు లేవు కాబట్టి ఫిరాయింపు ప్రశ్న తలెత్తదు, పైగా టీడీపీకి ఉన్న బలం కూడా తగ్గుతుంది. ఈ విధానం అమలు చేయాలని ఇపుడు వైసీపీ అనుకుంటోందని టాక్. అదే కనుక జరిగితే గెలిచిన వారు బీజేపీలోకి, ఓడిన వారు వైసీపీలోకి పోతారు. అపుడు మొత్తానికి మొత్తం టీడీపీ ఖాళీ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: