మంచి సీఎంగా ఆరు నెలల్లో పేరు తెచ్చుకోవాలి..ఇదీ జగన్ టార్గెట్.. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారు. సుపరిపాలన కోసం తపన పడుతున్నారు. అవినీతికి పాల్పడితే మంత్రులనైనా పదవుల నుంచి పీకేస్తానని మొదటి కేబినెట్ సమావేశంలోనే ఘాటుగా చెప్పేశారు జగన్. 


మరి ఇప్పుడు అలాంటి జగన్ పై అవినీతి విష,యంలో ఒత్తిడి వస్తోందా.. ప్రత్యేకించి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చూసీ చూడకుండా వెళ్లమని జగన్ పై కొందరు ఒత్తిడి చేస్తున్నారా.. ఈ మాటలు చెబుతున్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ జగనే. ప్రాజెక్టులకు సంబంధించి నియమించిన నిపుణుల కమిటీతో సమావేశం నేపథ్యంలో జగన్ ఈ కామెంట్స్ చేశారు.

జగన్ ఏమన్నారంటే... ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదు. టెండర్ల విధానం అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. చెడిపోయిన వ్యవస్థను బాగుచేసుకోవడానికి తపిస్తున్నా. కళ్లు మూసుకోండని నాపైనా ఒత్తిడి తెచ్చారు. అలా చేయదలుచుకోలేదు కాబట్టే అవినీతిపై పోరాటానికి సిద్ధమయ్యా. ఇలాంటి స్కాంలను సమర్థించలేం. 

పోలవరం పనుల్లో అక్రమాలు నిగ్గు తేల్చండి.. పోలవరంతోపాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో రివర్స్‌టెండరింగ్‌కు ఎక్కడ అవకాశం ఉందో గుర్తించండి. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గందరగోళం చేసింది.. స్పిల్‌వే పూర్తిచేయకుండా కాఫర్‌ డ్యాంకు వెళ్లారు. దాన్ని కూడా పూర్తిచేయకుండా వదిలేశారు.. పోలవరం నాకు అత్యంత ప్రాధాన్యమైన ప్రాజెక్టు అని జగన్ అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: