తెలంగాణా రాష్ట్రంలో కెసిఆర్ కు ఎలాంటి పేరు ఉన్నదో ఆయన తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న నేత హరీష్ రావు.  2014లో తెరాస ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖామంత్రిగా పనిచేశారు.  చెరువుల విషయంలో అనేక నిర్ణయాలు తీసుకొని నీటిని తెలంగాణాకు వచ్చే విధంగా చేశారు.  


మాస్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు హరీష్ రావు. ఎన్నికల్లో హరీష్ రావుకు కట్టుబడి అనేకమంది ఓట్లు వేసిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు సిద్ధిపేట నియోజక వర్గం ఎంతలా అభివృద్ధి చెందిందో చెప్పక్కర్లేదు.  హరీష్ రావు కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టి విజయవంతం అయ్యాడు.  


కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ నుంచి అన్ని దగ్గరుండి చూసుకున్నారు.  2018 లో జరిగిన ఎన్నికల్లో మరోమారు తెరాస పార్టీ విజయం సాధించింది.  ఈమారు హరీష్ కు మంత్రి పదవి ఇవ్వలేదు.  అటు కేటీఆర్ ను కూడా పక్కన పెట్టారు.  కాకపోతే, కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవిని ఇచ్చి.. పార్టీలో కీలకం చేశారు.  


హరీష్ రావును పూర్తిగా పక్కన పెట్టడంతో ఆయన అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు.  కాళేశ్వరం ఓపెనింగ్ సమయంలో కూడా హరీష్ రావుకు పిలవలేదు.  పూర్తిగా పక్కన పెట్టడంతో అభిమానులు పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారు.  కానీ, హరీష్ మాత్రం చిరునవ్వుతో అన్నింటిని వింటున్నాడు గాని తన మనసులోని ఆలోచనను మాత్రం బయటపెట్టడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: