ఆయనతో పొత్తు ఎప్పటికి ఉండదని బీజేపీ తెగేసి చెప్పింది.  ఇకపై పొత్తు పెట్టుకునే అవకాశం కానీ, ఆలోచన కానీ రాకపోవచ్చు అని అధిష్ఠానం చెప్పిన సంగతి తెలిసిందే.  దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనా పాగా వెయ్యాలని చూస్తోంది.  


అది అంత సాధ్యం అయ్యే విషయం కాదని బీజేపీకి తెలుసు.  అందుకే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలను బీజేపీవైపుకు తిప్పుకుంటోంది.  వైకాపాకు చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిపోయారు.  రేపోమాపో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.  


వైకాపాలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని తెగేసి చెప్పడంతో ... ఎందుకొచ్చిందిలే అని చెప్పి బీజేపీలో జాయిన్ అవుతున్నారు.  16 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని వినికిడి.  ఇదే జరిగితే ... భవిష్యత్తులో టిడిపి తిరిగి పుంజుకోవడం కష్టమే.  తెలంగాణాలో ఉన్న పరిస్థితులు ఏపి లోను ఎదురుకావొచ్చు.  


అయితే, బీజేపీ ఒక్క టిడిపి కి చెందిన నేతలను మాత్రమే కాకుండా వచ్చే ఎన్నికల సమయానికి వైకాపాకు చెందిన కొంతమందిని కూడా తన పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోంది.  దక్షిణాదిన కర్ణాటక మినహా బీజేపీకి బలం లేదు.  తెలుగు రాష్ట్రాల నుంచి తన ప్రయత్నాలను మొదలుపెట్టాలని చూస్తోంది బీజేపీ.  


మరింత సమాచారం తెలుసుకోండి: