కృష్ణానది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసానికి ఆనుకుని నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కలెక్టర్ల సదస్సు ముగిసిన వెంటనే కూల్చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిన్న ఆదేశించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా, నిర్మాణంలో అవినీతికి తావిచ్చిన ఈ భవనంలో ఈ కలెక్టర్ల సదస్సే చివరి సమావేశం   కావాలని సూచించారు. 


దీనిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించినట్టుగా తెలుస్తుంది. "ప్రభుత్వ భవనం  ప్రజా వేదికను కూల్చివేయాలనుకోవడం సరైన ఆలోచన కాదు. వైఎస్ విగ్రహాలు ఏ అనుమతి లేకుండా వందల సంఖ్య లో ఏర్పాటు చేశారు , వాటి సంగతి ఏంటి !? ," అని ఆయన అన్నట్టు సమాచారం. ప్రజాధనం గురించి మాట్లాడే ముందు అనుమతులు లేకుండా, చట్టాలను ఉల్లఘించి ప్రజా వేదికను ఎందుకు కట్టాల్సి వచ్చిందో ఆయన చెబితే బావుంటుంది. 


అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ విగ్రహాలు ఏ అనుమతి లేకుండా వందల సంఖ్య లో ఏర్పాటు చేస్తే నెల ముందు వరకూ ఉన్న ఆయన ప్రభుత్వం ఏం చేసినట్టు? ఎటువంటి చర్య తీసుకున్నట్టు? ఇప్పుడు ఆ మాట అడగడానికి సిగ్గు పడాలి చంద్రబాబు గారూ. గత వారం రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి వచ్చారు. మరోవైపు బుధవారం నాడు ప్రజావేదిక భవనం కూల్చివేతకు అధికారులు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: