ఆచీ తూచీ అన్న ప్రశ్నే లేదు. ఒకసారి కనుక అనుకుంటే చేసేయడమే. ముందూ వెనకా జాన్తా నై .  మరి ఈ విధంగా దూకుడుగా వెళ్ళే వారు ఇతర దేశాల్లోనే చూశారంతా. తొలిసారిగా మన దేశంలో చూస్తున్నారు. ఎవరికీ జంకని లొంగని ఆ తీరు బెంబేలెత్తిస్తోంది.


అదే జగన్. ఆయన సీఎం గా దూకుడుగా ఉంటున్నారు. ప్రజా వేదిక కూల్చివేస్తానని చెప్పిన నలభై ఎనిమిది గంటల్లో కూల్చేశారు. దాంతో జగన్ ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం అనుకుంటే ఆగరని అర్ధమైపోతోంది. ఆయన వద్ద ఎటువంటి వత్తిళ్ళు పనిచేయవని కూడా అంటున్నారు. జగన్ ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే ఇక అంతే


ఇదే టీడీపీ తమ్ముళ్లకు వణుకు పుట్టిస్తోంది. అది ప్రజావేదికతో ఆరంభం అయింది.  ఇక మిగిలిన వాటి విషయంలో ఇలాగే ఉంటే, ఇంత కఠినంగా ముందుకు సాగితే మా సంగతేంటి. ఇదే తమ్ముళ్లను వేదిస్తున్న ప్రశ్న. జగన్ ఆగడు ఎక్కడా. ఆయన నిర్ణయాలు అలాగే ఉంటాయి. రెండో ఆలోచన ఉండదు. దాంతో అక్రమార్కులు, అవినీతి పరులకు ఇపుడు నిద్రపట్టడంలేదు. అక్కడ కూలింది ప్రజావేదిక కాదు, భవిషత్తు అని తెగ పరేషాన్ అవుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: