ఒకప్పుడు జగన్ అంటే అవినీతి పరుడు.. లక్షకోట్ల రూపాయల అక్రమాస్తులను సంపాదించాడు అని మీడియాలో ఊకదంపుడుగా వార్తలువచ్చేవి.  వీటిపై కేసులు పెట్టారు.  కానీ, చివరకు ఏమైంది.  పెట్టిన ఒక్క కేసుకు కూడా ప్రూవ్ కాలేదు.  ఇప్పుడు జగన్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.  అవినీతికి పాల్పడితే ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు. ప్రజలకు తెలియదా ఆ సంగతి.  


ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక జగన్ దూకుడు పెంచాడు.  వరసగా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నాడు.  తాజాగా కృష్ణానది కరకట్ట పై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు జగన్.  జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ప్రజావేదిక విషయంతో ఆగిపోయేలా లేదు.  



కరకట్టపై అక్రమంగా నిర్మించిన అన్ని నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు.  నదీ పరివాహక ప్రాంత అధికార కార్యాలయం నుంచి అనుమతులు తీసుకోకుండా వందలాది నిర్మాణాలను నిర్మించారు.  వీటినిపై కూడా జగన్ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.  ఒకవేళ ఈ నిర్మాణాలను కూల్చివేస్తే.. దీనిఫలితం ఇంకా అనేక మందిపై పడే అవకాశం ఉంది.  


నాయకులు కారకట్టలపై అనేక నిర్మాణాలను నిర్మించారు.  వీళ్ళతో పాటు.. అటు సామాన్యులు కూడా గోదావరి, కృష్ణ కరకట్ట ప్రాంతంలో నిర్మాణాలను నిర్మించుకున్నారు.  ఒకవేళ జగన్ వీటిపై కూడా దృష్టిపెడితే.. సామాన్యుల పరిస్థితి ఏంటి.. జగన్ మాత్రం వీటి విషయంలో ఏ మాత్రం వదిలేలా కనిపించడం లేదు.  అవినీతిపై కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే.. మరోసారి దానిజోలికి వెళ్లాలంటే భయపడతారు అనే సిద్దాంతంతో జగన్ ముందుకు కదులుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: