24 గంటలు 365 రోజులు పనిచేసే వారిలో పోలీసులు కూడా ఉన్నారు.  వీళ్లకు పాపం రెస్ట్ అనేది ఉండదు.  రెస్ట్ లేకుండా పనిచేస్తే ఎన్ని ఇబ్బందులు వస్తాయో చెప్పక్కర్లేదు.  అందుకే పోలీసుల విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు.  వారంలో ఒక రోజును వీక్లీ హాఫ్ గా ప్రకటించారు.  ఇలా చేయడం వలన మిగతా రోజుల్లో పోలీసులు పని తీరు బాగుంటుందని జగన్ విశ్వాసం.  


ప్రతి పోలీస్ స్టేషన్ లోను ఒక రిసెప్షన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు.  రిసెప్షన్ ను ఏర్పాటు చేయడం వలన కంప్లైట్ చేయడానికి వచ్చిన వాళ్లకు మర్యాద లభిస్తుంది.  ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థలో ఈ తరహా సిస్టం లేదు.  కంప్లైట్ చేయడానికి వెళ్తే.. ఎం జరుగుతుందో అని భయపడిపోతున్నారు.  


ఎస్పీ స్థాయి ఉద్యోగులు వారి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో అకస్మాత్తుగా తనికీలు నిర్వహించాలని, అక్కడ పనిచేసే ఎస్ఐ, సిఐ స్థాయి ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని జగన్ అధికారులకు సూచించారు. 

ఇలా చేయడం వలన ఆయా స్థాయిలో ఉండే ఉద్యోగులు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకునే సౌలభ్యం కలుగుతుందని జగన్ అంటున్నాడు.  పోలీసులు అంటే ప్రజలను రక్షించే వారుగా ఉండాలిగాని.. భక్షించే వాళ్ళు కాదని ప్రజలు తెలియజేయాలని జగన్ అధికారులకు సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: