ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడేందుకు మార్గాలను అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే.  అధికారంలో ఉన్న వైకాపాకు పెద్దగా ఇబ్బందులుకలిగించకుండా .. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను ఒక్కొక్కరిగా తమవైపు తిప్పుకుంటోంది.  


ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో జాయిన్ అయ్యారు.  మరికొంతమంది కూడా చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.  జగన్ మాత్రం వీటిని పట్టించుకోకుండా తన పని తానూ చేసుకుంటూ పోతున్నాడు.  


కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని.. అక్రమ కట్టడాల కూల్చివేతకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టబోతున్నట్టు జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.  చెప్పినట్టుగానే జగన్ కూల్చివేతను స్టార్ట్ చేశారు.  జనసేన పార్టీ అధినేత ఈ కూల్చివేతను సమర్ధించింది.  


కానీ, బీజేపీ మాత్రం కూల్చివేత విషయంలో జగన్ ను విమర్శించింది.  అక్రమ కట్టడమే కావొచ్చు.  కానీ దానిని గత ప్రభుత్వం ప్రజాధనంతో కట్టిందని, ఇప్పుడు ఇలా కూల్చడం వలన ప్రజాధనం వెస్ట్ అయ్యినట్టు అవుతుందని పేర్కొంది.  ఒకవేళ ప్రజావేదికను కూల్చాలి అన్నది ప్రభుత్వ నిర్ణయమే అయితే .. దానికి వ్యతిరేకించలేమని స్పష్టం చేశారు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ.  


మరింత సమాచారం తెలుసుకోండి: