టీడీపీ యువ‌నేత‌, మాజీమంత్రి లోకేష్ ప్ర‌హ‌స‌నాల ప‌ర్వం కొన‌సాగుతోంది. త‌న‌దైన శైలిలో కామెంట్లు చేసి ఇరుర్కుపోయే టీడీపీ యువ‌నేత తాజాగా మ‌ళ్లీ అదే రీతిలో బుక్క‌య్యారు. త‌మ పార్టీ, ప్ర‌భుత్వం గురించి ప్ర‌శంస‌లు కురిపించ‌డంలో భాగంగా, క్రెడిట్ సొంతం చేసుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నం ఆయ‌న్ను న‌వ్వుల పాలు చేసింది. ఏపీకి ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు అయిన పోల‌వరం విష‌యంలో చేసిన ట్వీట్‌తో లోకేష్ అడ్డంగా బుక్క‌య్యారు. వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ఓ రేంజ్‌లో టీడీపీ నాయ‌కుడిని ఆడుకున్నారు.


పోల‌వ‌రం ప్రాజెక్టు అంచ‌నాల‌పై అధ్య‌య‌నం చేయ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో త‌మ అవినీతి ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుందోననే క‌ల‌వ‌రం వ్య‌క్త‌మ‌యిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌యంలో, టీడీపీ యువ‌నేత లోకేష్ ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేశారు. ``తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన Rs.55,548 కోట్ల సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించడం జరిగింది. గతంలో తెదేపా ప్రభుత్వం పంపిన అంచనాలు అన్నింటికీ కేంద్రం ఆమోదం తెలిపితే, మరింక అవినీతి ఎక్కడ నుంచి వచ్చింది?`` అంటూ ఆయ‌న ట్విట్ట‌ర్లో ప్ర‌శ్నించారు.
అయితే, వైసీపీ నేత‌, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పోలవరం విషయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ``పోలవరం అంచనాల ఆమోదం, నిధుల గురించి వైఎస్ జగన్ గారు ప్రధానిని కలిసినప్పుడు కోరారు. దానికి స్పందనగానే రూ.55,548 కోట్ల సవరించిన అంచనాకు గ్రీన్ సిగ్నల్ దొరికింది. కానీ, ఇది తన తండ్రి కష్టానికి ఫలితమని లోకేష్ డప్పుకొట్టు కోవడం ఆపాలి. ఖర్చు చేసిన నిధులకు లెక్కలు చూపకుండా మొండికేసిన చరిత్ర మీది.'' అంటూ లోకేష్ ప‌రిజ్ఞానాన్ని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 


మాజీ మంత్రి యనమలను సైతం ఇదే రీతిలో ఇర‌కాటంలో ప‌డేశారు. ఉండ‌వ‌ల్లి ప్ర‌జావేదిక కూల్చడంపై య‌న‌మ‌ల కామెంట్లను ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. "రివర్ కన్జర్వేషన్ యాక్టును ఒకసారి చదవండి యనమల గారూ. ఎవరు తుగ్లకో తెలుస్తుంది. నదీ తీరాన్ని పూడ్చి కట్టిన నిర్మాణాలను తొలగించాలని డిమాండు చేయాల్సింది పోయి.. కాపాడాలని అడ్డుపడటం వింతగా ఉంది.  ప్రకృతి వనరులను ధ్వంసం చేసినందుకే కదా ప్రజలు మీకు వాతలు పెట్టి తరిమేశారు.'' అంటూ సోషల్ మీడియాలో ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: