కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఏదైనా తాయిలాలు ఉంటాయేమో అని ఆసక్తిగా ఎదురు చూశారు.  ప్రత్యేక హోదా విషయంపై ఏమైనా చెప్తారేమో అనుకుంటే అవేమి చెప్పలేదు.  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా నిధుల విషయం గురించి కూడా చెప్పలేదు.  


ఇంకా చెప్పాలి అంటే ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా నిధులు గురించి చెప్పలేదు.  అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.  ఏ రాష్ట్రానికి ఎంత రావాలో ఏ ఏ రూపంలో ఎంత వస్తుందో ప్రత్యేకంగా చెప్పకపోయినా బడ్జెట్ ను బట్టి రాష్ట్రానికి వచ్చేది ఎంతో అంచనా వేసుకోవచ్చు.  


ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో జగన్ ప్రభుత్వం ఆలోచనలో పడింది.  ప్రత్యేక హోదా కావాలని, తెస్తామని ఢిమాండ్ తోనే జగన్ అధికారంలోకి వచ్చారు.  ప్రత్యేక హోదా గురించిన ఊసు బడ్జెట్ లో లేదు.  ముందుగానే ఈ విషయాన్ని ఆర్థికశాఖ మంత్రి తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.  దేశం యొక్క అభివృద్దే లక్ష్యంగా పెట్టుకొని బడ్జెట్ ను రెడీ చేసింది నిర్మలా సీతారామన్.  


బడ్జెట్ పై సమాధానం పక్కన పెడితే... ప్రత్యేక హోదాపై జగన్ ప్రజలకు ఏమని సమాధానం చెప్తాడో చూడాలి.  తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ లో తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.  త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నది.  మరి ఇందులో వేటికి ప్రాధాన్యత ఇస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: