తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని భావిస్తున్న బీజేపీ.. ఎవరు పార్టీలోకి వచ్చినా.. చేర్చుకునేందుకు తలుపులు బార్లా తెరిచి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వైపు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు చేరేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సందర్భంగా నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరతారట.


నాదెండ్ల భాస్కర్ రావు.. క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఒక రకంగా ఆయన ఔట్ డేటెడ్ పొలిటీషియన్.. ఏదో యూట్యూబుల్లో ఇంటర్వ్యులు ఇచ్చుకోవడం మినహా ఆయన ద్వారా పెద్దగా ఒరిగేదేమీ లేదన్నది విశ్లేషకులు అభిప్రాయం. మరి ఓవైపు వృద్దాప్యం ముంచుకొస్తున్న సమయంలో ఈ మాజీ ముఖ్యమంత్రి యాక్టివ్ అవుతున్నారు.


1978లో రాజకీయాల్లో అడుగుపెట్టిన నాదెండ్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983 లో టిడిపిలో చేరి కీలక పాత్ర పోషించారు. ఎన్.టి.ఆర్.క్యాబినెట్ లో మంత్రిగా చేశారు. 1984 లో ఎన్.టి.ఆర్. ను వెన్నుపోటు పొడిచి నెల రోజుల పాటు ముఖ్యమంత్రి అయ్యారు.


ఆ తరవాత కాంగ్రెస్ లో చేరారు. 1989 లో తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఖమ్మం నుంచి కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్.పి అయ్యారు. ఆ తర్వాత పెద్ద రాజకీయాల్లో కనిపించని నాదెండ్ల ఇప్పుడు బీజేపీలో చేరడం ద్వారా ఏం ఆశిస్తున్నారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: