ప్రత్యేకహోదా అంశానికి సంబంధించి  జగన్మోహన్ రెడ్డికి  ప్రధానమంత్రి నరేంద్రమోడి పెద్ద షాకే ఇచ్చారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో హోదా అంశంపై కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కనీసం ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. బడ్జెట్లో హోదా ఊసే లేకపోవటంతో తన వైఖరి ఏంటో ప్రధానమంత్రి జగన్ కు స్పష్టంగానే చెప్పినట్లైంది.

 

2014లో రాష్ట్ర విభజన జరిగినపుడు ఏపికి ప్రత్యేకహోదా అన్న హామీ చాలా కీలకమైంది. ఎన్నికల్లో కూడా ఇదే హామీని మోడి పదే పదే ప్రస్తావించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మోడి తన హామీని కన్వీనియంట్ గా పక్కనపడేశారు. దీనికి సగం కారణం అప్పటి మిత్రుడు చంద్రబాబు అనక తప్పదు.

 

కారణం ఏదైనా కానీ ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వటం మోడికి ఇష్టం లేదని ఎప్పుడో తేలిపోయింది. దానికితోడు మొన్నటి ఎన్నికల్లో మంచి మెజారిటి రావటంతో ఏపి విషయాన్ని ఏ విధంగా కూడా పట్టించుకోవాల్సిన అవసరం కూడా మోడికి లేదు. అదే సందర్భంలో మొన్నటి ఎన్నికల్లో బిజెపి ఒక్క ఎంపి సీటు కూడా గెలవలేదు.

 

అందుకనే రాజకీయంగా చూసుకున్నా కూడా ఏపి ప్రయోజనాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మోడి అనుకునుండచ్చు.  ఒక్క సీటు కూడా రాని రాష్ట్రాన్ని కేంద్రం మాత్రం ఎందుకు పట్టించుకుంటుంది ? అధికారంలోకి రాగానే జగన్ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావించిన  విషయం తెలిసిందే. అయినా బడ్జెట్లో దాని ఊసే లేదంటే ఏపి ఆశలపై జగన్ కు మోడి పెద్ద షాక్ ఇచ్చినట్లే అనుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: