ఈ మద్య మహిళలపై ఎన్నోదారుణాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో అక్కడ మహిళలపై చివరికి చిన్నారులపై కూడా లైంగిక దాడులు అత్యాచారాలు, హత్యలకు పాల్పపాడుతున్నారు కామాంధులు.  అతడు ఓ అధికారి అయి ఉండి కూతా తన సహ అధికారిని నగ్నంగా వీడియో తీసి అబాసులు పాలు చేయాలని చూశాడు. కానీ ఆమె సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది.  వివరాల్లోకి వెళితే..చదురగిరి సుందరమహాలింగ ఆలయ హుండీ లెక్కింపు కోసం గతవారం మహిళా అధికారి ఒకరు ఆలయానికి వచ్చారు. వీఐపీలు ఉండే వసతి గృహంలో బసచేశారు.

కానుకల లెక్కింపు ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి వసతి గృహంలోనే ఉన్నారు.  ఆమె ఉదయం స్నానం చేసి వచ్చిన తర్వాత అక్కడ మగవారి బట్టలు కనిపించడం తో అనుమానం వచ్చింది. అతని జేబులోని రెండు సెల్ ఫోన్లు ఆన్ లో ఉన్నాయి. వెంటనే అనుమానం వచ్చిన ఆమె  షాక్‌కు గురైన ఆమె వెంటనే బాత్‌రూములోకి వెళ్లి అక్కడ ఉన్న దుస్తులను పరిశీలించారు. వాటిలో ఉన్న పెన్ కెమెరాలు ఆన్ చేసి ఉండడంతో దిమ్మతిరిగింది..ఇక్కడ ఏదో కుట్ర జరిగిందని తెలుసుకున్న ఆమె వెంటనే వాటిని తీసుకున్నారు. 

ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన ఆమె ఇంట్లోని తన ల్యాప్‌టాప్‌లో ఆ కెమెరాల్లోని మెమొరీ కార్డు వేసి చూశారు. అందులో తనతోపాటు మరో మహిళ స్నానం చేస్తున్న వీడియోలు ఉండడంతో షాకయ్యారు. అంతే సదరు అధికారి చేసిన నిర్వాకం పై వెంటనే చెన్నైలోని హిందూ దేవాదాయ శాఖ అధికారికి, మధురై డీఐజీకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో హిందూ దేవాదాయ శాఖ జోనల్ జాయింట్‌ కమిషనర్‌ పచ్చయప్పన్‌ ఈ పనికి పాల్పడినట్టు తేలింది. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: