తెలుగుదేశంపార్టీ మీద పడిన ఇమేజిని పోగొట్టేందుకు చంద్రబాబునాయుడు నానా అవస్తలు పడుతున్నారు. టిడిపి మీద కమ్మపార్టీ అనే ముద్ర వేయటం దారుణమంటున్నారు. కుప్పం పర్యటనలో అడిగిన వారికి అడగని వారికి కూడా ఇదే విషయం చెప్పుకుని తెగ బాధపడిపోయారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టిడిపి మీద కమ్మోరి పార్టీ అనే ముద్ర పడిపోయింది.

 

పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ హయాంలో లేని ముద్ర చంద్రబాబు హయాంలోనే ఎందుకు వచ్చింది ? ఎందుకొచ్చిందంటే అది చంద్రబాబు స్వయంకృతమే. మొదటి రెండు విడతలను వదిలిపెట్టినా 2014లో గెలిచిన తర్వాత పాలన మరీ దారుణమైపోయింది. పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా కీలక స్ధానాలన్నింటిలోను కమ్మోరి పెత్తనమే సాగిందనటంలో సందేహం లేదు.

 

నిజానికి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా రెడ్లదే పై చేయన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ జగన్ తెలివిగా మిగిలిన సామాజికవర్గాలను కూడా రెడ్లతో సమానంగా చూస్తున్నారు. దాంతో కాపులు, బిసిలు, ఎస్సీలు, మైనారిటిలు కూడా పార్టీ, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

మొన్న కుప్పం పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతూ టిడిపిపై కమ్మ పార్టీ అని ముద్రేయటం దారుణమన్నారు. కుప్పంలో కమ్మోరి ఓట్లు వెయ్యి కూడా లేకపోయినా తాను ఎలా గెలుస్తున్నానంటూ ప్రశ్నించారు. కుప్పంలో కమ్మోరి ఆధిపత్యం లేనంత మాత్రాన మిగిలిన రాష్ట్రం సంగతేంటి ? అందుకనే పార్టీ శాసనసభా పక్షం ఉపనేతగా బిసి వర్గానికి చెందిన అచ్చెన్నాయుడును ఎంపిక చేశారు. మొత్తానికి పార్టీపై కమ్మోరి పార్టీ అనే ముద్రను తుడిచేసేందుకు చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: