ఆ మద్య కర్ణాటకలో జరిగిన ఉత్కంఠ పోరులో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మద్య జోరుగా యుద్దం కొనసాగింది.  అయితే సందిట్లో సడేమియాలా జేడీఎస్ కి లాభం చేకూరింది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభం దిశగా పయనిస్తోంది. అప్పటి నుంచి సీఎం కుమార స్వామికి తన పరిపాలన నల్లేరుమీద నడకలా సాగుతుంది. 


ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలన సాగుతున్న విషయం తెలిసిందే.  మొదటి నుంచి కన్నడ నాట బీజేపీ కి మంచి పట్టు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పై మంచి మెజార్టీ సాధించినా..కాంగ్రెస్, జేడీఎస్ కూటమి కట్టడంతో సీఎం సీటు యడ్యూరప్పకు దక్కకుండా పోయింది.  తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు జేడీఎస్ సభ్యులు రాజీనామాలకు సిద్ధపడ్డారు.  


కర్ణాటక విధాన సభ స్పీకర్ కార్యదర్శికి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యేలలో రామలింగారెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్, రమేశ్ జర్క హళ్లి, బీసీ పాటిల్, మునిరత్న, ప్రసాదగౌడ పాటిల్, శివరామ్ ఉన్నారు.  అయితే కర్ణాటక అసెంబ్లీ మొత్తం స్థానాలు 224. బీజేపీకి 105 మంది, కాంగ్రెస్ పార్టీకి 78 మంది, జేడీఎస్ కు 37 మంది సభ్యులు.

 అయితే  కాంగ్రెస్, జేడీఎస్ కూటమితో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో సీఎంగా కుమారస్వామి నియమితులయ్యారు.  సాధారణ మెజార్టీకి 113 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో సంకీర్ణ ప్రభుత్వ బలం మరింత పడిపోతుంది. సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ క్రమంగా తగ్గిపోతున్న క్రమంలో బిజెపి అధికారాన్ని చేపట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: