అంతకు ముందు, గౌరీ లంకేష్ హత్యపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన  విచారణకు కోర్టుకు వెళ్లొచ్చారు రాహుల్ గాంధీ.  వెంటనే మరో పరువు నష్టం దావా రాహుల్ ను కోర్టుకు పిలుస్తోంది. ఇది 'మోడీ' అనే ఇంటి పేరు మీద చేసిన వ్యాఖ్యకు సంబంధించిన పిటిషన్. 'దొంగలందరికీ మోడీనే ఇంటి పేరుగా ఉంది..' అంటూ రాహుల్ గాంధీ ఎన్నికల  ప్రచార సమయంలో వ్యాఖ్యానించారు.

 

బిహార్ లో ఎన్నికల ప్రచారం సమయంలో రాహుల్ ఆ వ్యాఖ్య చేశారు. లలిత్ మోడీ- నీరవ్ మోడీలతో నరేంద్రమోడీని పోలుస్తూ.. రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్య చేశారు. ఐపీఎల్ స్కామ్ లో  పరారీలో ఉన్న లలిత్ మోడీ- పీఎన్బీ స్కామ్ లో పరారీలో ఉన్న నీరవ్ మోడీల ఇంటి పేరు ప్రధాని మోడీ ఇంటి పేరుతో మ్యాచ్ కావడం యాదృచ్ఛికమే అనాలి. అయితే రాహుల్ మాత్రం అలా వ్యాఖ్యానించేశాడు.

 

దీనిపై మరో మోడీ కోర్టుకు ఎక్కాడు. ఆయనే బిహార్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ. 'మోడీ' అనే ఇంటి పేరున్న వాళ్లందరినీ దొంగలు అని రాహుల్ అన్నాడని ఆయన పట్నా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఎన్నికలకు ముందే ఆ పిటిషన్ దాఖలు అయ్యింది. అందుకు సంబంధించి కోర్టు విచారణ చేపట్టింది.

 

రాహుల్ కు నోటీసులు జారీ హాజరు కావాలని ఆదేశించింది. గౌరీ లంకేష్ ను ఆర్ ఎస్ ఎస్ హత్య చేయించిందని వ్యాక్యానించి రాహుల్ దుమారం రేపాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా అలా మాట్టాడటంపై సంఘ్ పరువు నష్టం దావా వేసింది. ఇటీవలే అందుకు సంబంధించి మహారాష్ట్ర కోర్టుకు హాజరయ్యారు రాహుల్.


మరింత సమాచారం తెలుసుకోండి: