అనుకున్నంతా అవుతోంది. కర్ణాటకలో బీజేపీ చక్రం తిప్పుతోంది. కుమార స్వామి సర్కారుకు యమగండం పొంచి ఉంది. అధికార కూటమి నుంచి 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో .. కుమార స్వామి సర్కారు మైనారిటీలో పడిపోయింది.


కర్ణాటక అసెంబ్లీ మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 224, మేజిక్ ఫిగర్ 113. ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో .. కుమార స్వామి సర్కారు బలం.. 105 సీట్లకు పరిమితం కానుంది. ఈరోజు రాజీనామా చేసిన వారిలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.


ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ బలపరీక్ష కోరితే.. ప్రభుత్వం పడిపోయే అవకాశం పుష్కలంగా ఉంది. ప్రస్తుతం బీజేపీకి 104 సీట్ల బలం ఉంది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి విశ్వాసం కోల్పోతే.. బీజేపీ సర్కారు ఏర్పాటుకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.


ఆ సమయంలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే.. బీజేపీ ప్రభుత్వం నిలబడుతుంది. లేదంటే గవర్నర్ మధ్యంతర ఎన్నికలకు కూడా ఆదేశాలు ఇవ్వొచ్చు. మొత్తానికి కర్ణాటకలో కుమార స్వామి సర్కారు కూలిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: