ఆర్నెల్లలో పెద్దాపురం ఎమ్మెల్యే మారబోతున్నారా ? అంటే అవుననే అంటున్నారు వైకాపా నాయకురాలు , ఆ పార్టీ పెద్దాపురం అభ్యర్థి తోట వాణి . ప్రస్తుత ఎమ్మెల్యే , మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప పై అనార్హత వేటుపడడం ఖాయమని చెబుతున్నారు . చినరాజప్ప ఎన్నిక చెల్లదంటూ తోట వాణి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు . ఎన్నికల అఫిడవిట్ లో ఆదాయవనరులను , క్రిమినల్ కేసులను దాచి పెట్టి , చినరాజప్ప తప్పుడు  డిక్లరేషన్ ఫైల్ చేశారని, ఆయన ఎన్నిక చెల్లదని తీర్పునివ్వాలని కోర్టును కోరారు .


2007లో ఓబుళాపురం మైనింగ్ కార్యాలయం పై జరిగిన దాడి కేసులో చినరాజప్ప 15వ ముద్దాయిగా ఉన్నారని , ఈ కేసును కొట్టివేయాలని గత ప్రభుత్వం రెండుసార్లు జీవో ల ద్వారా కోర్టుకు నివేదించిందని , అయినా కోర్టు తిరస్కరించి వారెంట్ కొనసాగిస్తోందని చెప్పారు . తాను డిప్యూటీ సీఎం , ఎమ్మెల్సీగా జీతాన్ని తీసుకున్న విషయాన్ని దాచిపెట్టి కేవలం వ్యవసాయం ద్వారానే తనకు ఆదాయం లభిస్తుందని పేర్కొని ఎన్నికల కమిషన్ ను చినరాజప్ప తప్పుదారి పట్టించారని తోట వాణి అన్నారు . ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని చినరాజప్ప ఎన్నిక రద్దు చేయాలని కోరుతోంది.


ఆర్నెళ్లలో న్యాయస్థానం ఈ కేసును తెలుస్తుందని తోట వాణి ఆశించడం లో తప్పులేదు కానీ , న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న కేసులు ఎన్నో ఉన్నాయి . గతం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పై అనార్హత  వేయాలని కోరుతూ వైకాపా దాఖలు చేసిన పిటిషన్ పై , వారి పదవీకాలం ముగిసిన కూడా తీర్పు వెలవడలేదన్న విషయాన్నీ తోట వాణి గుర్తుంచుకుంటే మంచిది .


మరింత సమాచారం తెలుసుకోండి: