చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నిక చెల్లదంటూ వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు . కరణం బలరాం తన ఎన్నికల  అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని  ఆయన  ఆరోపించారు. కరణం బలరాంకు నలుగురు సంతామమయితే , ఎన్నికల అఫిడవిట్ లో కేవలం ముగ్గురని మాత్రమే చూపించారని పేర్కొన్నారు .కరుణం బలరాం కు నల్గురు సంతానం ఉన్నటువంటి  ఆధారాలను సైతం హైకోర్టుకు ఆమంచి  సమర్పించారు.


  కరణం బలరాంపై అనర్హత వేటు వేసి  తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు ఆమంచి కృష్ణమోహన్. తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించినా, రణం బలరాం ఎన్నిక చెల్లదని  ఆమంచి కృష్ణమోహన్ అంటున్నారు . కృష్ణమోహన్ న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాలి . ఇకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులకు సంతానం విషయంలో ఇంత మందే ఉండాలనే నిబంధన ఏదీ లేకపోయినప్పటికీ , తప్పుడు సమాచారం తో ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించడం అనేది నేరమే .


స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు  మాత్రం ఇద్దరు సంతానానికి మించి ఉండరాదన్న నిబంధనను నూతనంగా తీసుకువచ్చారు . దానిప్రకారం అధిక సంతానం కలిగిన వారిపై అనర్హత వేటు పడడం ఖాయం . ఇటీవల హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేటర్ గా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఎన్నికయిన కార్పొరేటర్ పై కోర్టు అనర్హత వేటు వేసింది. మరి బలరాం పై ఆమంచి ఫిర్యాదు మేరకు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి .

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: