జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల్లోని అతి ముఖ్యమైన పథకం వైయస్సార్ రైతు భరోసా. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం ఈ పథకాన్ని 2020 సంవత్సరం నుండి అమలు చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 రబీ సీజన్ నుండే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. 12,500 రుపాయల్ని పెట్టుబడి సాయంగా రైతులకు అందించబోతున్నారు. పెట్టుబడి సాయంతో పాటు ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. 
 
జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మిగతా రాష్ట్రాలలో రైతులకు మేలు చేకూరేలా పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కౌలు రైతులను మాత్రం ప్రభుత్వాలు విస్మరించాయి .కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కౌలు రైతులకు మేలు చేకూరేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 32 లక్షల మంది రైతులు లబ్ధి పొందబోతున్నట్లు ఒక సర్వే ప్రకారం అంచనా వేస్తున్నారు. 
 
కానీ కౌలు రైతులకు ఈ పథకాన్ని అమలు చేయటం అంత తేలిక కాదు. ఎందుకంటే చాలా మంది పొలాలు కౌలు చేస్తున్నప్పటికీ ఎలాంటి గుర్తింపు కార్డులు ఉండవు. కౌలు రైతుల్లో చాలా మందికి రైతుల దగ్గరనుండి సరైన అగ్రిమెంట్లు ఉండవు.కౌలు రైతులకు ఈ పథకాన్ని అమలు చేయటంలో సమస్యలున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం కౌలు రైతుల్లో ఆనందాన్ని నింపుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: