తెలంగాణ‌లోని నిరుద్యోగుల‌కు ఓ శుభవార్త‌. సుదీర్ఘ‌కాలంగా సాగుతున్న నిరీక్ష‌ణ‌కు ప్ర‌భుత్వం తెర‌దించింది. రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 8,792 టీచర్ పోస్టుల (టీఆర్టీ) భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని నిర్ణయించింది. నియామకాల మార్గదర్శకాలకు సీఎం కేసీఆర్ శనివారం ఆమోదం తెలిపారు. టీఆర్టీ నియామక ప్రక్రియ వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు టీఆర్టీ ఫైల్‌పై విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి సంతకంచేసి, మార్గదర్శకాలతో జీవో 10ని విడుదలచేశారు. పదిహేను రోజుల్లో టీఆర్టీ ప్రక్రియను పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను జనార్దన్‌రెడ్డి ఆదేశించారు.


8,792 టీచర్ పోస్టులను పాత 10 జిల్లాల ప్రకారం టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీచేయాలని అధికారులు నిర్ణయించారు. టీఆర్టీకి సంబంధించి 1,950 స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులు, 1,011 భాషా పండితులు, 416 పీఈటీలు, 5,415 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా టీచర్ల నియామకాలకు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు పాత జిల్లాలవారీగా జిల్లాస్థాయి కమిటీ (డీఎల్సీ)లను ఏర్పాటుచేయాలని జీవోలో పొందుపరిచారు. కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, డీఈవో కార్యదర్శిగా, సీఈవో జిల్లా పరిషత్తు/ మున్సిపాలిటీలు/ మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా కలెక్టర్ ఎంపికచేసినవారు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, కొత్త జిల్లాలకు చెం దిన డీఈవోలు సభ్యులుగా కొనసాగుతారు.


ముఖ్యమైన మార్గదర్శకాలు
-టీఆర్టీకి ఎంపికైన అభ్యర్థుల రోస్టర్ పాయింట్, ర్యాంకును విడుదల చేస్తారు. 
-ప్రాంతం, మీడియం, సబ్జెక్టులవారీగా పోస్టులను కొత్త జిల్లాలతో కలిపి గుర్తించాలి. 4, 3, 2, 1 క్యాటగిరీలవారీగా చూ పెట్టాలి. అక్కడ ఖాళీగా ఉండాలి. టీచర్ విద్యార్థి నిష్పత్తిని తప్పకుండా పాటించాలి. క్యాటగిరీ నాలుగులో ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలి.
-బాలికల స్కూల్లో మహిళలనే నియమిం చాలి. మహిళా అభ్యర్థి అందుబాటులో ఉంటే పురుషులకు పోస్టింగ్ ఇవ్వొద్దు.
-టీఆర్టీ ద్వారా ఎంపికైన అభ్యర్థులను రోస్టర్ క్రమం, ర్యాంకులవారీగా స్పీడ్ పోస్టు/ రిజిస్టర్ పోస్టు ద్వారా పిలువాలి. మీడియా ద్వారా ప్రచారం చేపట్టాలి.
-కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులకు మెరిట్ ర్యాంకు ఆధారంగా పోస్టింగ్ ఇవ్వాలి. పోస్టులో నియామక పత్రాన్ని అభ్యర్థి ఇంటి చిరునామాకు పంపాలి.
-పోస్టింగ్ ఆర్డరు అందుకున్న అభ్యర్థుల వివరాలు డీఈవో కార్యాలయాల్లో పెట్టా లి. వాటిపై అభ్యంతరాలు స్వీకరించాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: