బీహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్‌ మోదీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి స్థానిక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దొంగల ఇంటి పేర్లన్నీ మోదీ అని ఎందుకుంటున్నాయో తనకు అర్థంకావడంలేదని గతంలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుశీల్‌కుమార్‌ మోదీ పరువునష్టం కేసు దాఖలు చేశారు.

 

శనివారం జరిగిన ఈ కేసు విచారణకు రాహుల్‌ స్వయంగా హాజరయ్యారు. విచారణ తర్వాత జడ్జి బెయిల్‌ మంజూరు చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌ కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వానికి, బీజేపీ-ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.

 

అయినా ‘పేదవాళ్లు, రైతుల తరఫున పోరాడాలని నిర్ణయించుకున్నా. వారి తరఫున నా గొంతుకను వినిపిస్తూనే ఉంటాను’ అని తెలిపారు. మరోవైపు రాహుల్‌గాంధీ రాకతో కోర్టు పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో దేశవ్యాప్తంగా ప్రజాదరణ గల యువ నాయకుడ్ని ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)కి పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ విజ్ఞప్తి చేశారు.

 

రాహుల్‌ రాజీనామా చేయడం దురదృష్టకరమని శనివారం తెలిపారు. క్షేత్రస్థాయిలో యావత్‌ భారతావనిని ఆకర్షించగల సత్తా గల యువనేతను ఎంపిక చేయాలని సూచించారు. అయితే రాహుల్ అరెస్ట్ ను అందరు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అది బి.జె.పి కి అంట శ్రేయస్కరం కాదని రాజకీయ పండితులు వాదిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: