తెలుగుదేశం పార్టీకి త్వరలోనే మరో అదిరిపోయే షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు.. మాజీ ఎమ్మెల్యేలు.. సీనియర్లు వరుస పెట్టి ఇతర పార్టీలో చేరి పోతున్నారు. ఇప్పటికే కొందరు బిజెపి బాట పట్టగా మరికొందరు వైసీపీలోకి వెళ్ళిపోయే ప్రయత్నాల్లో బిజీ అయిపోతారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రావు టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. పార్టీ మారే అంశంపై తన సన్నిహితులు, అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన అంశంపై వారితో చర్చించారు.


రాజకీయంగా టీడీపీలో ఉంటే భవిష్యత్తు లేదని అందుకే వైసీపీలోకి వెళ్ళిపోదామని చర్చించినట్లు తెలుస్తోంది. టిడిపిలో కీలక నేతగా ఉన్న భాస్కరరావు 1994 , 1999 ఎన్నికల్లో పెద్దాపురం నుంచి వరుస విజయాలు సాధించడంతో పాటు విప్‌గా కూడా పని చేశారు. ఆతర్వాత పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 2011లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మరి గెలిపించారు. 2014 ఎన్నికలకు ముందు భాస్కరరావు వైసీపీలోకి జంప్ చేసేశారు. ఎన్నికల్లో ఆయన తనయుడు వెంకటరమణ చౌదరి రాజమహేంద్రవరం ఎంపీగా పోటీ చేసి మురళీమోహన్ చేతిలో ఓడిపోయారు.


రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో బొడ్డు తిరిగి టిడిపిలోకి వెళ్లిపోయారు. పార్టీ మారిన బొడ్డును చంద్రబాబు పట్టించుకోవడం మానేశారు. ఎన్నికలకు ముందు బొడ్డు పెద్దాపురం అసెంబ్లీ సీటు ఆశించారు. ఈ క్రమంలోనే అప్పటి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆయనకు తీవ్రమైన వైరుధ్యం ఏర్పడింది. బొడ్డు బెదిరించినా చంద్రబాబు మాత్రం చిన రాజప్పకి పెద్దాపురం సీటు ఇచ్చారు. ఎన్నికలో వైసీపీ అభ్యర్థి తోటవాణి పై రాజ‌ప్ప నాలుగు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


ఇటు సీటు ఇవ్వ‌క‌పోవ‌డంతో పాటు టీడీపీ ఘోరంగా ఓడిపోవ‌డంతో బొడ్డు భాస్క‌ర‌రావు ఇప్పుడు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం వైసీపీలో పాత ప‌రిచ‌యాలు వాడుకుని పార్టీ కండువా మార్చేందుకు రెడీ అవుతున్నారు. జిల్లాలో ప‌ట్టున్న బొడ్డు పార్టీ మార‌డం టీడీపీకి పెద్ద షాకే.


మరింత సమాచారం తెలుసుకోండి: