కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ఎటువంటి నిధులు కేటాయించలేదన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ నిరసనను తెలియజేస్తున్నాయి. ఈ విషయంపై కేంద్రాన్ని పదే పదే కోరాలని, పార్లమెంట్‌లోనూ ఇదే విధానంతో ముందుకెళ్లాలని ఎంపీలకు సూచించాలని సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. అలాగే, త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలంతా సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.


సభలో పార్టీ వ్యూహాన్ని పక్కాగా అనుసరించాలని సీఎం నిర్ణయించారు. పది మంది చొప్పున ఎమ్మెల్యేలను సమన్వయం చేసి, పార్టీ వ్యూహాలను వివరించేందుకు సమన్వయకర్తను నియమించాలని సీఎం సూచించినట్లు తెలిసింది.ఇదే సమయంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ జిల్లాల నుంచి ఉద్యోగులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసుకు తరలివచ్చారు.


కొందరు రెండు రోజులుగా ఇక్కడే ఉంటూ సీఎంకి వినతిపత్రాలు అందజేయడానికి ఎదురు చూస్తున్నారు. చిత్తూరు జిల్లా అక్కంబొట్ల కండ్రిగ, మరాఠిపురం, చింతలపాలెం నుంచి వచ్చిన ప్రజలు తమ భూములను పరిరక్షించాలంటూ ఆందోళన చేపట్టారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన వారిలో ఒకరు జగన్‌ను లిసి తమ సమస్య వివరించారు. దీనిపై స్పందించిన సీఎం.. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఆయనను కలవాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: