అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయకుండా కేవలం ఎలక్షన్ సమయంలో ప్రజలను ఆకర్షించడం మనదేశంలో సర్వసాధారణం.కళ్ళు బైర్లు కమ్మే పథకాలు, చెవులలో తేనెలు పోసే వాగ్దానాలు చేస్తుంటారు రాజకీయ నాయకులు. ఎలక్షన్ రోజు డబ్బు పంచడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. ఇలాంటివి జరగకుండా చూడటానికె ఎలక్షన్ కమిషన్ ఉంది.కానీ  ఎలక్షన్ కమిషన్ ను లెక్కచేయకుండా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ముందు నగదు బదిలీ పథకాలు పెట్టి ప్రజలకు డబ్బు పంచాలని పెంటపాటి పుల్లారావు గారు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
ఎన్నికల ముందు నగదు బదిలీ పథకాలు పై నిషేధం విధించాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, బెంగాల్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు దీనిపై సుప్రీం కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో ప్రవేశపెడుతున్న పథకాలను చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంటూ పిటిషనర్ పెంటపాటి పుల్లారావు సుప్రీంను  కోరారు. గతంలో దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చింది. వాదనల తర్వాత దీనిపై సీఈసీ తోపాటు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీం.
 
ఏపీలో అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ పథకాలను తెరపైకి తీసుకువచ్చింది అప్పటి  రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలోనూ ఇదే తరహాలో రైతుబంధు పథకాన్ని అమలు  పరిచారంటూ పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలని సుప్రీంకోర్టు ను కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: