కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు సరిగ్గా జరగలేదు. కావాలనే మోడీ ప్రభుత్వం జగన్ ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రానికి కేంద్రం ప్ర‌క‌టించిన బడ్జెట్‌లో మోదీ ప్ర‌భుత్వం మొండిచేయి చూపిన సంగ‌తి తెలిసిందే. దీంతో జ‌గ‌న్ ప‌రిస్థితి కుడితో ప‌డిన ఎల‌క‌లాగా త‌యార‌య్యింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మోదీని ఢీకొట్టే స‌హాసం జ‌గ‌న్ చేస్తారా అన్న‌ది ఇప్పుడు అస‌క్తిక‌లిగిస్తోంది.


మోదీ అంటె జ‌గ‌మొండి. తాము చెప్పిన విధంగా విన‌కుంటే మోదీ ఏమైనా చేయ‌గ‌ల‌డు. ప్ర‌ధానిని ఢీ కొట్టిన మ‌మ‌తా బెన‌ర్జీ ప‌రిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటే మోడీ ప్రతాపం ఏంటో అర్ధమవుతుంది. గ‌త ఐదేళ్ల‌లో మోదీ తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఎదురించే శ‌క్తి ప్ర‌స్తుతం ఏ రాష్ట్రా సీఎంల‌కు లేదు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప‌రిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా త‌యార‌య్యింది. తీవ్ర ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంటేనె ప‌రిస్థితులు మొరుగ‌వుతాయి. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాల‌ను భారీ మొత్తంలో నిధులు అవ‌స‌రం అవుతాయి. ఇలాంటి స‌మ‌యంలో కేంద్ర మాత్ర‌మే ఆదుకోగ‌ల‌దు.


తనకు తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేకమైన ప్రేమ లేదని మోడీ చెప్పేశారు. నేనేది విదిలిస్తే అదే ప్రసాదంలా తీసుకోడంటూ క్లారిటీగా చెప్పేస్తున్నారు. మరి మోడీని ఎదిరించిన పాపానికి 40 సంవ‌త్స‌రా అనుభ‌వం ఉన్న బాబుకు ఏగ‌తి ప‌ట్టిందో తెలిసిందే. జగన్ కి రాజకీయాల్లో పదేళ్ళ అనుభవం మాత్రమే ఉంది. ఇలాంటి క్లి ష్ట ప‌రిస్థితుల్లో కేంద్రంతో గొడవ పెట్టుకుంటే కుదిరే వ్యవహారమేనా అన్నది చూడాలి. కేంద్ర సాయం లేకపోతే ఇపుడు అడుగు తీసి అడుగు వేయదు. బాబుని బదనాం చేసినట్లే జగన్ని చేద్దామని బీజేపీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్ర‌స్తుతం బాబు పాత్ర‌లో జ‌గ‌న్ ఉన్నారు. జ‌గ‌న్ పాత్ర‌లో ప్ర‌స్తుతం బాబు ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో మోదీని జ‌గ‌న్ ఢీ కొడ‌తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: