సినీనటుడు పవన్ కల్యాణ్ ఐదేళ్ళ క్రితం జనసేన పార్టీ స్థాపించాడు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయనప్పటికీ టీడీపీకు జనపేన పార్టీ తరపున మద్దతిచ్చి ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడానికి తన వంతు ప్రయత్నమైతే చేసాడు పవన్ కల్యాణ్. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. పార్టీ అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ కూడా ఓడిపోవటంతో ప్రస్తుతం జనసేన పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 
 
రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలతో పోలిస్తే ఆర్థికంగా మాత్రం జనసేన బలహీనంగా ఉంది. మరో వైపు కేంద్రంలో నరేంద్ర మోడీ రెండోసారి విజయం సాధించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ పార్టీ నామమాత్రంగా కూడా ప్రభావం చూపించలేకపోయింది. బీజేపీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేసేంత స్థాయి ఉన్న నాయకులు ఎవరూ ఆ పార్టీలో లేరు. అందువలన బీజేపీ పవన్ కల్యాణ్ ను బీజేపీలో చేర్చుకుని జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని భావిస్తోంది. 
 
కానీ పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీలో చేరటానికి ఇష్టం వ్యక్తం చేయటం లేదు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసాడు. అప్పట్లో చిరంజీవి అలా చేయటంపై చాలా విమర్శలు వచ్చాయి. పవన్ కల్యాణ్ కూడా అలా చేస్తే జనసేన పార్టీపై విమర్శలు వస్తాయని పవన్ కల్యాణ్ ఈ ప్రతిపాదనకు దూరంగా ఉన్నట్లు సమాచారం . కానీ బీజేపీ మాత్రం పవన్ కల్యాణ్ కోసం ప్రయత్నాలు ఐతే ఆపట్లేదు. తానా సభలో కూడా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ బీజేపీలో చేరమని పవన్ కల్యాణ్ గారిని కోరాడట. పవన్ కల్యాణ్ మాత్రం ప్రస్తుతానికైతే చేరే ఉద్దేశం లేదని చెప్పినట్లు తెలుస్తుంది. మరి పవన్ నో చెప్పినప్పటికీ బీజేపీ తన ప్రయత్నాలు ఆపుతుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: