ఆ మద్య ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లోక్ సభ, రాజ్య సభ ఎన్నికల్లో వైసీపీ దుమ్మురేపింది.  అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీకి చుక్కలు చూపించింది.  అందరి అంచనాలు తలకిందులు చేస్తూ 175 స్థానాలకు గాను 151 స్థానాలు గెల్చుకుంది. ఇక లోక్ సభ 25 స్థానాలకు గాను 22 గెల్చుకుంది.  ఇలా ఏపిలో వైసీపీ ప్రభంజనం సృష్టించడం పై వైకాపా నేతల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.  ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పై ప్రజలకు అప్పుడే ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటీ నెరవేర్చడం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఇక మంగళగిరి నుంచి లోకేష్ బాబు పై వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి  గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఆయన గెలుపు పై టీడీపీ నేతలు రక రకాలుగా వదంతులు పుట్టిస్తున్నారు.  ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను టీఆర్ఎస్ నుంచి రూ.100 కోట్లు తీసుకున్నట్లు టీడీపీ చేస్తున్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా వీటిపై స్పందించిన మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి ఈరోజు పాల్గొన్నారు.   తాను లంచాలు తీసుకున్నట్లు, అవినీతికి పాల్పడినట్లు టీడీపీ నేతలు నిరూపిస్తే రాజకీయాల తాను శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు.  ఓ బీసీ మహిళ(పంచుమర్తి అనురాధ)ను  అడ్డు పెట్టుకుని ఆమెతో నాపై విమర్శలు చేయించడం పద్దతి కాదు. ధర్మం కాదు అని తెలియజేస్తున్నా అని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: