తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. చరిత్రలోనే అత్యంత దారుణమైన పరాజయాన్ని అందులోనూ తన కన్నా చాలా చిన్నవాడైన జగన్ చేతిలో ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే ఆయన ఆ పరాజయాన్ని జీర్ణించుకుంటున్నారు.


పరాజయంతో టీడీపీ పరిస్థితి దీనంగా తయారైంది. తనయుడు లోకేశ్ కూడా ఘోరంగా ఓడిపోయాడు. ఇక ఎంపీ సీట్ల సంగతి మరీ దయనీయం. కేవలం మూడే రావడంతో ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పడం సంగతి అటుంచి... చంద్రబాబును ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు.


ప్రస్తుతం కనుచూపు మేరలో పార్టీకి మంచిరోజులు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుకు ఓ ఆశాకిరణం కనిపిస్తోంది. బీజేపీ అమలు చేయాలని చూస్తున్న జమిలి ఎన్నికల అంశం టీడీపీ నేతల్లో ఆశలు రేపుతోంది.


జమిలి ఎన్నికలు అమలు చేస్తే .. 2022లో ఏపీలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అంటే సరిగ్గా మూడు సంవత్సరాలు.. ఈ మూడేళ్లలో జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తే దాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు.. జమిలి ఎన్నికలు వస్తే ఎగరెగిరిపడుతున్న కొందరికి షాక్ తప్పదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: