వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బాగా మెచ్చుకున్న ఓ అధికారిని ఇప్పుడు జగన్ పట్టుబట్టి మరీ ఏపీకి రప్పించారు. కేంద్రంలో పనిచేస్తున్న ఆ ‌అధికారిని ఏపీకి రప్పించేందుకు జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. డిప్యూటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కు రప్పించి కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు.

ఇంతకీ ఎవరా అధికారి అంటారా.. ఆయనే ఏవీ ధర్మారెడ్డి. ఆయన ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. ఆయన్ను డిప్యూటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కు పంపుతూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మారెడ్డి వై.ఎస్‌. రాజశేఖర్ రెడ్డి హయాంలో టీటీడీ జేఈవో, తిరుమల స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు.

అప్పట్లో జేఈవోగా, స్పెషల్ ఆఫీసర్ గా ధర్మారెడ్డి సేవలను వైఎస్ మెచ్చుకున్నారు. అందుకే మరోసారి టీటీడీలో ధర్మారెడ్డి సేవలను వినియోగించుకోవాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేంద్రహోంశాఖలో కీలకమైన హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ హోదాలో ధర్మారెడ్డి పని చేస్తున్నారు.

మరి ధర్మారెడ్డిని మళ్లీ టీటీడీ సేవలకే వినియోగిస్తారా.. లేక.. వేరే బాధ్యతలు అప్పగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఐతే.. నమ్మినవారికి, మనవాళ్లు అనుకున్నవారికి వైఎస్ ఫ్యామిలీ ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటో ఈ ఉదంతంతో మరోసారి వెల్లడైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: